Home » Exclusive » Today Covid Update %e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b %e0%b0%95%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be %e0%b0%a1%e0%b1%87%e0%b0%82%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d %e0%b0%ac%e0%b1%86
Exclusive

Today Covid Update : దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 3,37,488 కొవిడ్ కేసులు.!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 22, 2022, 10:53 am
Advertisement

Today Covid Update : దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 3,37,488 కొవిడ్ కేసులు.!దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వేగంగా ప్రవహిస్తోంది. దేశవ్యాప్తంగా నిన్నలాగే నేడు కూడా కేసులు భారీగా నమోదయ్యాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 3 లక్షల 37 వేల 488 కేసులు నమోదయ్యి… మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మహమ్మరితో తాజాగా 703 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం 20, 18, 825 యాక్టిివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10, 050కు చేరుకుంది. తాజాగా 2, 42, 676 మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి.

2022 january 22 today corona updates in india

Advertisement

తమిళనాడు, జమ్ముకాశ్మీర్ లో వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రతీ ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏపీతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పక పాటించాలని హెచ్చరిస్తున్నాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి