janaki kalaganaledu 24 january 2022 episode
Janaki Kalaganaledu 24 Jan Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 24 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 221 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి బస్సు ప్రమాదంలో చనిపోలేదని రామాకు తెలుస్తుంది. జానకినే స్వయంగా రామాకు ఫోన్ చేసి తనకు ఏం కాలేదని.. మీరు టెన్షన్ పడొద్దని చెబుతుంది. దీంతో రామా ఊపిరి పీల్చుకుంటాడు. మీరు ఎక్కడున్నారు.. అసలు మీ పేరు ఎందుకు న్యూస్ లో చెప్పారు అని అడుగుతాడు రామా. శ్రావణి ఫోన్ చేయడంతో ముందే బస్సు దిగానని.. బస్సు దిగిన తర్వాత ప్రమాదం చోటు చేసుకుందని చెబుతుంది జానకి. మరి మీ ఫోన్ బస్సులో దొరికింది కదా అని అడిగితే.. బస్సు దిగే హడావుడిలో ఫోన్ బస్సులోనే మరిచిపోయాను అని చెబుతుంది జానకి.
janaki kalaganaledu 24 january 2022 episode
దీంతో రామా వెంటనే తను ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి బయలుదేరుతాడు. తన వెంటనే జ్ఞానాంబ, వెన్నెల, గోవిందరాజు కూడా బయలుదేరుతారు. వెంటనే తన దగ్గరికి చేరుకొని తనను హత్తుకుంటాడు రామా. మీరు ఫోన్ చేయడం ఒక్క క్షణం ఆలస్యమైనా నేను ఇప్పుడు మీ ముందు ఇలా ఉండేవాడిని కాదంటాడు రామా. ఇప్పటి నుంచి మిమ్మల్ని నేను అస్సలు వదిలిపెట్టను. ఇక నుంచి మీ వెంటే నేను ఉంటాను.. అంటూ తనకు ప్రామిస్ చేస్తాడు రామా. ఇంతలో గోవిందరాజు కారు వస్తుంది. జ్ఞానాంబ కారులో నుంచి దిగుతుంది కానీ.. జానకితో మాట్లాడదు. వెన్నెల వెళ్లి.. జానకిని హత్తుకుంటుంది. సారీ వదిన.. అంతా నావల్లే అంటుంది. ఊరుకో వెన్నెల అంటుంది జానకి. గోవిందరాజు వెళ్లి జానకితో మాట్లాడుతాడు. కానీ.. జ్ఞానాంబ రాదు. దీంతో జరిగిందేదో జరిగిపోయింది.. పదా జ్ఞానం కోడలును ఇంటికి తీసుకెళ్దాం అంటాడు గోవిందరాజు.
కానీ.. జ్ఞానాంబ మాత్రం ఏం మాట్లాడదు. ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా పంతాలు పట్టింపులు ఎందుకు జ్ఞానం అంటాడు గోవిందరాజు. కానీ.. తను మాత్రం వినదు. జానకి ఇంటికి రావాలంటే మేమిద్దరం కలిసి ఒక చోటుకు వెళ్లాలి అంటుంది జ్ఞానాంబ. తనను తీసుకొని ఎక్కడికో వెళ్తుంది.
కట్ చేస్తే తన తోటకు తీసుకెళ్తుంది జ్ఞానాంబ. తోటలో ఉన్న పని మనుషులను కాసేపు పక్కకు వెళ్లండి అంటుంది. అసలు.. జ్ఞానాంబ ఏం చేస్తుందో జానకికి అర్థం కాదు. ఇంతలో కన్నబాబు బైక్ వేసుకొని అక్కడికి వస్తాడు. కన్నబాబు రావడం చూసి జానకి షాక్ అవుతుంది.
కన్నబాబును అత్తయ్య గారు ఎందుకు పిలిచారు అని షాక్ అవుతుంది జానకి. ఇంతలో బైక్ ఆపి కన్నబాబు పరిగెత్తుకుంటూ జ్ఞానాంబ దగ్గరికి వస్తాడు. అర్జెంట్ గా రమ్మని ఎందుకు పిలిచారు అని అంటాడు కన్నబాబు. దీంతో జానకి నిన్ను ఎందుకు కొట్టింది అని అడుగుతుంది జ్ఞానాంబ.
చెప్పు ఏం గొడవ.. ఏం జరిగింది అని జానకి ముందే కన్నబాబును నిలదీస్తుంది జ్ఞానాంబ. దీంతో కన్నబాబు నీళ్లు నములుతాడు. కట్ చేస్తే సంక్రాంతి సంబురాలలో జ్ఞానాంబ ఫ్యామిలీ ఆనందంగా గడుపుతుంది. వాళ్లలో జానకి కూడా ఉంటుంది.
అందరూ ఆత్రేయపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబురాల్లో పాల్గొంటారు. జానకి, రామా సంతోషంగా ఉంటారు. దీంతో జ్ఞానాంబ హ్యాపీగా ఉంటుంది. ఆల్ హ్యాపీస్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.