Petrol and Diesel Rates : అక్కడ రూ.77కే డీజిల్, రూ.82కే పెట్రోల్..!
Petrol and Diesel Rates : దేశంలోని ప్రధాన నగరాలతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ పెట్రోల్ ధర ఎప్పుడో సెంచరీ దాటేసింది. మరోవైపు డీజిల్ కూడా అదే దారిలో కొనసాగుతోంది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రకటించాయి. అయితే దేశంలో ఎక్కడ చూసినా లీటరు పెట్రోలకు 100 పైనే పెట్టాల్సి వస్తుండగా..
పోర్ట్ బ్లెయిర్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 82.96గా ఉండగా.. డీజిల్ ధర రూ. 77.13 గా మాత్రమే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు లేకపోగా నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 108.20.. డీజిల్ ధర లీటరుకు రూ. 94.62 వద్ద కొనసాగుతోంది.

Today petrol and diesel rates in telugu states
గుంటూరు, అమరావతిలో.. పెట్రోల్ రేటు లీటరుకు రూ. 110.67, డీజిల్ ధర రూ. 96.08 వద్ద కొనసాగుతోంది. ఇక అత్యంత ఎక్కువగా రాజస్థాన్‌లోని గంగా నగర్‌లో లీటరు పెట్రోల్ రేటు రూ. 112.11 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో అతి తక్కువగా లీటరు పెట్రోల్ ధర రూ. 95.41 వద్ద కొనసాగుతోంది.