Kodi Pandalu : కోడి పందెంలో పాతిక ల‌క్ష‌లు పోగొట్టుకున్న తెలుగు న‌టుడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kodi Pandalu : కోడి పందెంలో పాతిక ల‌క్ష‌లు పోగొట్టుకున్న తెలుగు న‌టుడు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :18 January 2022,10:00 am

Kodi Pandalu :సంక్రాంతికి ఏపీలో కోడిపందేల జోరు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ పందేలలో కోట్లు పోగొట్టుకున్న వారు లేక‌పోలేదు. అయితే తాజాగా కోడి పందెం కోసం ఏపీకి వెళ్లిన ఒక సినీ నటుడు అక్కడ లక్షల రూపాయలు పందెంలో ఓడి పోయినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అత‌ను ఏడాదికి పది పదిహేను సినిమాలు చేస్తూ రోజుకు రెండు మూడు లక్షల రూపాయల పారితోషికం అందుకునే ఆ నటుడుగా తెలుస్తుంది. ఇటీవ‌ల అత‌ను క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా మంచి హిట్ ద‌క్కించుకొని వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటున్నాడ‌ట‌.

కెరీర్ ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతున్న స‌మ‌యంలో ఏపీకి వెళ్లి ఆ న‌టుడు పాతిక లక్షల రూపాయలను పోగొట్టుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాడట.అతడి గురించి తెలిసిన సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.ఇలాంటి చెడు అలవాట్లు మానుకోవాల‌ని కూడా హిత‌బోధ చేస్తున్నార‌ట‌. ఇత‌నితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా కోడి పందేల‌లో పాల్గొన్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌తి ఏడాది ఎంతో జోరుగా సాగే కోడి పందేల‌లో కొంద‌రికి అదృష్టం వ‌రిస్తే మ‌రి కొంద‌రికి జేబు ఖాళీ అవుతుంది.

tollywood actor lost 25 lakhs in kodi pandalu

tollywood actor lost 25 lakhs in kodi pandalu

Kodi Pandalu పాపం.. పాతిల ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడా…!

కృష్ణాజిల్లా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ దాదాపు ప్రతీ పల్లెలోనూ కోడి పందాలు జోరుగా సాగాయి. వీటిని స్ధానిక ప్రజాప్రతినిధులే దగ్గరుండి మరీ నిర్వహించారు. ఈ పందేల‌లో లక్షల రూపాయల డబ్బులు చేతులు మారుతున్నాయి. అళాగే కోళ్లకు కత్తులు కట్టి మరీ ఈ పందేలు నిర్వహించారు.గోదావరి జిల్లాల్లోనూ దాదాపు ప్రతీ పల్లెలూ పందాలు నిరాటంకంగా సాగాయి. మొన్నటివరకూ పందాలు నిర్వహించరాదని ఆంక్షలు పెట్టిన పోలీసులు.. పండగ వచ్చేసరికి మౌనంగా ఉండిపోయారు. దీంతో పందేలు యథేచ్ఛగా సాగాయి. సంక్రాంతి అంటేనే కోడి పందాలు కాబట్టి పందాలు నిర్వహిస్తున్నామని పందెం రాయుళ్లు చెప్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది