Iron | మహిళల్లో ఐరన్ లోపం.. ఆరోగ్యాన్ని కాపాడే ఐరన్ ఆహారాలు ఇవే!
Iron |ఆధునిక జీవనశైలిలో మహిళలు తరచూ ఎదుర్కొనే సమస్యల్లో అలసట, జుట్టు రాలడం, రక్తహీనత (అనీమియా) ప్రధానమైనవిగా నిలుస్తున్నాయి. ఈ లక్షణాల వెనుక ఐరన్ లోపం అనే కారణం ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అత్యవసరమైన ఐరన్ శరీరానికి సరిపడని పరిమాణంలో లభించకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తడం అనివార్యం అవుతుంది.

#image_title
ప్రత్యేకించి మహిళలకు గర్భధారణ, రుతుస్రావం, తల్లిపాలు ఇచ్చే దశల్లో అధిక ఐరన్ అవసరం ఉంటుంది. అందుకే మహిళలు తమ ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవడం అత్యంత కీలకం. ఐరన్ లోపం లక్షణాలు చూస్తే.. శారీరక శ్రమ లేకపోయినా అలసట, జుట్టు పలుచగా కావడం, అధికంగా రాలిపోవడం, గోళ్లు పెళుసుగా మారడం, మానసిక ఉద్రిక్తత, చిరాకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పసుపు లేదా నలుపు రంగులోకి మారడం, తల తిరగడం, బలహీనత
వారానికి ఒక్కసారి తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ ఆహారాలు:
పాలకూర:
ఐరన్, ఫోలేట్, ఫైబర్, కాల్షియంతో నిండిన ఆరోగ్యవంతమైన ఆకుకూర. కూరగా, పరోటాలో, స్మూతీలో తీసుకోవచ్చు.
బీట్‌రూట్:
రక్తాన్ని శుద్ధి చేయడంలో, హిమోగ్లోబిన్ పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే ఇది మహిళల ఆహారంలో తప్పనిసరి.
బెల్లం:
సహజ స్వీటెనర్ అయిన బెల్లం ఐరన్‌తో పాటు శక్తిని అందిస్తుంది. రుతుస్రావం సమయంలో బలహీనత నివారించడంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది.
దానిమ్మ:
విటమిన్ సి, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉండే ఈ పండు హిమోగ్లోబిన్ పెంపులో సహాయపడుతుంది.
గుమ్మడికాయ గింజలు:
ఈ చిన్న గింజల్లో ఐరన్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. స్నాక్స్‌గా, సలాడ్స్‌లో చేర్చుకోవచ్చు.
చిరుధాన్యాలు:
బజ్రా, జొన్న, సజ్జ వంటి మిల్లెట్లు ఐరన్ పుష్కలంగా కలిగిన స్థానిక సూపర్ ఫుడ్స్. మిల్లెట్ రొట్టెలు, కిచిడీ రూపంలో వీటిని తీసుకోవచ్చు.