TPCC New Chief : టీపీసీసీ కొత్త బాస్ ఎవరు? ఆ నేత వైపే మాణికం ఠాగూర్ మొగ్గు?
TPCC New Chief : టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపిక దాదాపు పూర్తయినట్టేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ టీపీసీసీ చీఫ్ పేరును ఖరారు చేశారని.. తెలంగాణ వచ్చిన రోజు జూన్ 2 న ప్రకటిస్తారని అప్పుడు వార్తలు వచ్చాయి. కానీ.. అవేమీ అమలు కాలేదు. అయితే.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత టీపీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. కొత్త చీఫ్ ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే.. తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్.. తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎవరైతే బాగుంటుందని.. అందరు నేతల అభిప్రాయాలు తీసుకొని.. రిపోర్టు తయారు చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి పంపించారు.
అయితే.. సోనియా, రాహుల్ ఇద్దరు కూడా ఎక్కువగా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేశారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ.. అవేమీ కార్యరూపం దాల్చలేదు. మరోసారి మాణికం ఠాగూర్.. సోనియా గాంధీకి.. టీపీసీసీ చీఫ్ ఎంపికపై నివేదిక పంపించారట. ప్రస్తుతం అయితే టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డిలు తర్వాతి ప్లేస్ లో ఉన్నారు. ఏది ఏమైనా.. టీపీసీసీ చీఫ్ పదవికి వీళ్లలో రేవంత్ రెడ్డి మాత్రమే సమర్థమైన నాయకుడు అనే భావనలో మాణికం ఠాగూర్ కూడా ఉన్నారట.
TPCC New Chief : రేవంత్ రెడ్డి వద్దంటూ.. వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలు
మాణికం ఠాగూర్ తో పాటు.. సోనియా, రాహుల్ లు కూడా రేవంత్ రెడ్డికే మద్దతు తెలుపుతున్నా.. ప్రస్తుతం నోటుకు ఓటు కేసులో ప్రధాన నిందితుడుగా రేవంత్ రెడ్డి ఉండటం.. వేరే పార్టీ నుంచి వచ్చిన నేత కావడంతో.. రేవంత్ రెడ్డి నియామకాన్ని కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారట. అందుకే.. టీపీసీసీ చీఫ్ ప్రకటన ఆలస్యం అవుతోంది.. అని తెలుస్తోంది. కొందరు నేతలు వ్యతిరేకిస్తుండటంతో.. వాళ్లను సముదాయించడానికి కాంగ్రెస్ హైకమాండ్ తెగ ప్రయత్నిస్తోందట. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ పదవి ఇవ్వాలని.. అసంతృప్తితో ఉన్న నేతలకు వేరే పదవులను కట్టబెట్టాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నారట. ఏది ఏమైనా.. హైకమాండ్ తో పాటు.. మాణికం ఠాగూర్ కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతుండటంతో.. రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్టే అన్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి.. ఎప్పుడు టీపీసీసీ చీఫ్ ను నియమిస్తారో?