Tribanadhari Barbarik | సినిమాకి ఆదరణ లేదు..ఛాలెంజ్ స్వీకరించి చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు
Tribanadhari Barbarik | ప్రస్తుతం సినిమాల ప్రమోషన్‌లో సెన్సేషనల్ స్టేట్‌మెంట్‌లు సాధారణం అయిపోయాయి.”సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కిస్తాం, లేదంటే మా ఇంటికొచ్చి కొట్టండి! ఇలాంటి సంచలన వ్యాఖ్యలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ఉపయోగపడతాయి. తాజాగా ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స కూడా ఇలాగే ఒక పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

#image_title
దారుణాతి దారుణం..
ఈ సినిమా నచ్చకపోతే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా! సినిమా విడుదలైంది. బాక్సాఫీసు దగ్గర ఆశించిన రెస్పాన్స్ రాలేదు. దాంతో మోహన్ శ్రీవత్స నిజంగానే తన చెప్పుతో తాను తన్నుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసి నెట్టింట్లో వైరల్ అయ్యాడు. తన ఆవేదనను బయటపెట్టిన మోహన్ మాట్లాడుతూ ..ఓ థియేటర్‌కు వెళ్లాను. అందులో కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. వాళ్లను సినిమా ఎలా ఉందని అడిగితే – ‘బావుంది సార్’ అని చెప్పారు.
నిజంగా వాళ్లకూ సినిమా నచ్చింది. కానీ… బాగున్న సినిమాకే జనం ఎందుకు రారు?అంతటితో ఆగకుండా తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఇక్కడ మద్దతు లేకపోతే మలయాళ ఇండస్ట్రీకి వెళ్లిపోతా. అక్కడ సినిమా తీసి హిట్ కొట్టి చూపిస్తా. ముందే ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కట్టుబడి, సినిమా నచ్చకపోతే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా అన్న మాటను జ్ఞాపకం చేసుకుని, తనని తానే చెప్పుతో కొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.