TRS : టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న సీనియర్ నేత? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న సీనియర్ నేత?

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 May 2021,6:56 pm

TRS : తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆ పార్టీ నేత ఈ పార్టీలో చేరడం.. ఈ పార్టీ నేత ఆ పార్టీలో చేరడం.. పరిపాటిగా మారిపోయింది. తెలంగాణలో ఇప్పటి నుంచి కాదు.. దశాబ్దాల నుంచి రాజకీయాలు అలాగే ఉన్నాయి. ఒక్క పార్టీలో ఉన్న నేత ఎప్పుడు మరో పార్టీలో చేరుతారో తెలియదు. అంతా గందరగోళం. అందుకే తెలంగాణ రాజకీయాలను అంచనా వేయడం చాలా కష్టం. రాత్రికి రాత్రే పరిణామాలు మారిపోతుంటాయి.

trs senior leader to join in congress party

trs senior leader to join in congress party

అయితే.. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ గురించే ఎక్కువగా చర్చ నడుస్తుంటుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో పాటు.. టీఆర్ఎస్ లో ఇటీవల జరుగుతున్న సంఘటనలు కూడా దానికి నిదర్శనం. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు ఎక్కువైందని.. అందుకే వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వాళ్లు కొందరు.. ఇంకా టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న ఇంకొందరు నేతలు కూడా పార్టీలో ఇమడలేక బయటికి వెళ్లిపోవాలని చూస్తున్నారట.

ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు వేరే పార్టీల నేతలతో టచ్ లో ఉన్నారట. అదును చూసి.. వేరే పార్టీలోకి జంప్ కొట్టాలని భావిస్తున్నారట. అంతవరకు బాగానే ఉంది కానీ.. టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేత, సీఎం కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు అయిన ఒక సీనియర్ నేత టీఆర్ఎస్ ను వీడనున్నారట.

TRS : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టచ్ లో ఉన్న ఆ నేత?

ఆ సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారట. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న ఆ నేత.. వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి.. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారట. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు బాగా లేకపోవడం.. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో ఈటల వ్యవహారం పెద్ద చర్చనీయాంశం కావడంతో సమయం కోసం వేచి చూస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఈ విషయమై చర్చలు కూడా జరిపారట. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా కీలకమైన పదవి ఇవ్వడానికి ఆ నేతకు బంపర్ ఆఫర్ ప్రకటించిందట. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

నిజానికి ఆ నేత బీజేపీలో చేరేందుకు ఇదివరకు ఆసక్తి చూపించారట. కానీ.. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఏం బాగాలేదు. దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తెలంగాణలో కూడా బీజేపీ పరిస్థితి అటూఇటూ గానే ఉంది. దీంతో.. బీజేపీలో కాకుండా.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆ నేత సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఆ కీలక నేత ఎవరు? ఎప్పుడు కాంగ్రెస్ లో చేరుతారు.. అనే విషయం తెలియాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది