Ragi Rotti Recipe : రాగి పిండితో రొట్టె ఈ విధంగా చేసి చూడండి… ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి…
Ragi Rotti Recipe : రాగి పిండి అంటే దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది చిన్నపిల్లల దగ్గర నుండి, ముసలివారి వరకు ఎంతో బలవర్ధకమైన పదార్థం, అలాగే ఈ రాగి పిండిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి దీనిని తినడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇటీవల లో దీనిని బాగా వాడుతున్నారు. దీనిని జావాలాగా చేసుకుని త్రాగుతున్నారు. అయితే కొందరు ఇలా జావా త్రాగడం ఇష్టపడరు. కాబట్టి అలాంటి వారికి కూడా ఈ రాగి పిండి రొట్టెలుగా చేసి తినేలా చేద్దాం.. అయితే ఈ రాగి పిండితో రొట్టెలు తయారు చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
దీనికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, వేడి నీరు, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగినవి, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ మొదలైనవి. దీని తయారీ విధానం: ముందుగా రాగి పిండి ఒక కప్పు తీసుకొని, దాన్లో రుచికి సరిపడినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేడి నీటిని కొంచెం కొంచెంగా పోస్తూ, కొంచెం గట్టిగానే ఈ పిండిని కలుపుకోవాలి.
తరువాత దీని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనిని తర్వాత చిన్న ముద్దలుగా చేసుకొని, వీటిని రొట్టెల్లాగా ఒత్తుకోవాలి.తర్వాత స్టవ్ పై నాన్ స్టిక్ పెనం పెట్టుకొని, నూనె వేయకుండా దీని రెండువైపులా కలర్ మారేవరకు కాల్చుకొని తీసుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా ఈ రాగి రొట్టె రెడీ.. ఈ రొట్టెను రైతాతో కానీ, నాన్ వెజ్ తో కానీ, ఆకుకూరలతో కానీ ఇలా తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గిపోతుంది. అలాగే అధిక బరువు తగ్గుతారు. అలాగే ఎంతో కండపుష్టి ఉంటుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రాగి రొట్టెను చేసుకొని తినండి ఇలా.