TSCAB Recruitment : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఆలస్యం చేస్తే ఆశాభంగం
TSCAB Recruitment : నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ షెడ్యూల్డ్ బ్యాంక్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీగా ఉన్న 445 స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో స్టాఫ్ అసిస్టెంట్- 372, అసిస్టెంట్ మేనేజర్-73 పోస్టులున్నాయి. తెలంగాణ స్టేట్ లోని అన్ని జిల్లాలో గల జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహిస్తుంది.
విద్యార్హతలు : స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుం డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
తెలుగు భాషలో ప్రావీణ్యం కావాలి.
ఆంగ్ల పరిజ్ఞానం తప్పనిసరి.
కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం అవసరం.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, లేదా 55% మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి.
తెలుగు భాషలో ప్రావీణ్యం కావాలి.
ఆంగ్ల పరిజ్ఞానం తప్పనిసరి.
కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం అవసరం.
ముఖ్య సమాచారం:
వయసు: ఈ పోస్టులకు వయోపరిమితి 18 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ‘
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీలకు రూ. 250, ఇతరులు (BC/GENERAL)కు రూ. 900.
వేతనాలు : అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.26,080 నుంచి 57,860 వరకు చెల్లిస్తారు.
స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.17,900 నుంచి 47,920 వరకు చెల్లిస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.
దరఖాస్తులకు చివరితేది: మార్చి 6, 2022