Tirumala Laddu : వాట్సాప్ ద్వారా తిరుమల లడ్డూ ప్రసాదం ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా..?
Tirumala Laddu : తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) (టీటీడీ) భక్తులకు మరో సౌకర్యాన్ని అందిస్తోంది. భక్తులు ఇకపై తిరుపతి ప్రసిద్ధ లడ్డూ ప్రసాదాన్ని వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించింది. టికెట్ల బుకింగ్, వసతి వివరాలు, ఆలయ సమయాలు తదితర సేవలను కూడా టీటీడీ వాట్సాప్‌లో (WhatsApp) అనుసంధానించింది. ఈ కొత్త సేవల ద్వారా భక్తులకు ఆలయ దర్శనం మరింత సులభతరం కానుంది. మొత్తం 15 కీలక సేవలను టీటీడీ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది.
వాట్సాప్‌లో లడ్డూ ప్రసాదం బుక్ చేసుకునే ప్రక్రియ చాలా సులభం. ముందుగా 9552300009 నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకుని, ఆ నంబర్‌కు “హాయ్” అని మెసేజ్ పంపాలి. ఆపై సిస్టమ్ ద్వారా మెనూ వస్తుంది, అందులో ‘లడ్డూ సేవ’ను ఎంచుకోవాలి. అవసరమైన వివరాలను ఇచ్చిన తర్వాత డబ్బు చెల్లించి, లడ్డూ ప్రసాదం భక్తుల ఇంటికి పంపిస్తారు. ఈ విధంగా భక్తులు ఆలయానికి వెళ్లకుండానే లడ్డూ ప్రసాదాన్ని పొందే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

Tirumala Laddu : వాట్సాప్ ద్వారా తిరుమల లడ్డూ ప్రసాదం ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా..?
ఈ సేవలతో పాటు, స్లాట్ చేయబడిన సర్వదర్శన్ టోకెన్ల లైవ్ స్టేటస్, క్యూ కాంప్లెక్స్‌లో క్యూ వివరాలు, శ్రీ వాణి ట్రస్ట్ టిక్కెట్ల లభ్యత, అడ్వాన్స్ డిపాజిట్ రీఫండ్ లైవ్ అప్‌డేట్‌లు వంటి అనేక సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం తర్వాత ప్రకటించిన ఈ చొరవ, రాష్ట్ర ప్రభుత్వ ఇ-గవర్నెన్స్ లక్ష్యాలకి అనుగుణంగా అమలవుతోంది. భక్తుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు ఇది ఒక కీలక పరిమాణం అని చెప్పవచ్చు.