Tirumala : జగన్ ఐడియాతో అద్భుతమైన ప్లానింగ్.. తిరుమలలో అమలు.. దర్శనం ఇక చాలా సులువు..!
Tirumala : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. దానికి కారణం.. వేసవి సమీపిస్తుండటం, మరోవైపు పరీక్షల కాలం కావడంతో తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పరీక్షల షెడ్యూల్ ముగిస్తే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. అందుకే ఏపీ సీఎం వైఎస్ జగన్.. దర్శనాన్ని సులువు చేయడం కోసం, సర్వ దర్శనం విషయంలో భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా అద్భుతమైన ప్లానింగ్ చేశారు. దానికోసమే టీటీడీ అధికారులు సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చారు.
అదే ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ఇక మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండదు. తిరుమలకు రాగానే.. అక్కడ రూమ్ తీసుకోవాలన్నా.. లడ్డు కొనాలన్నా, శ్రీవారి దర్శనం చేసుకోవాలన్నా అన్నింటికీ ఫేషియల్ రికగ్నిషన్ ఏర్పాటు చేశారు. దర్శనం చేసుకునే భక్తులకే లడ్డు ఇస్తారు. రూమ్ ఇస్తారు. దాని కోసం ఆధార్ డేటా ఆధారంగా ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. తిరుమలలో ఈ మధ్య దళారీ వ్యవస్థ ఎక్కువైంది. సర్వదర్శనం టికెట్లు, లడ్డుల టికెట్లు, రూమ్స్ ను ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు.
Tirumala : అవినీతిని అరికట్టేందుకే?
కొందరు తమ ఆధార్ కార్డుతో టికెట్లు తీసుకొని వాటిని వేరే వాళ్లకు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఇందులో టీటీడీ ఉద్యోగులు కూడా కొందరు ఉన్నారు. ఈ దందా చాలా రోజుల నుంచి నడుస్తోంది. ఈ దందాకు పుల్ స్టాప్ పెట్టడానికి, తిరుమలకు వచ్చిన భక్తులకు దర్శనం సులువుగా అయ్యేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఎలాంటి అవినీతి జరగకుండా.. ఫేసియల్ రికగ్నిషన్ తీసుకొని దర్శనం చేసుకునే భక్తులకు మాత్రమే లడ్డుతో పాటు రూమ్ ను కూడా అలాట్ చేయనున్నారు. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా మార్చి 1 నుంచి ప్రారంభించారు.