Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉపయోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా అద్భుత ప్రయోజనాలు కలిగించగలదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులను నీటిలో మరిగించి తాగడం వల్ల అనేక రకాల శరీర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

#image_title
1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది
తులసి నీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.రోజూ తులసి నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు, వైరల్ ఇన్‌ఫెక్షన్లను నివారించవచ్చు. శరీర రోగ నిరోధక శక్తి బలపడుతుంది.
2. జీర్ణక్రియ మెరుగవుతుంది
తులసి నీరు గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలకు మంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే ఆకలిని పెంచే గుణం కూడా తులసిలో ఉంటుంది. జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా సహాయపడుతుంది.
3. మానసిక ఆరోగ్యానికి ఉపశమనం
ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట అనుభవిస్తున్నవారు ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే, మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది సహజంగా బీపీ నియంత్రణలోకి తీసుకువస్తుంది. మధుమేహం ఉన్నవారికి కూడా తులసి నీరు ఎంతో మేలు చేస్తుంది.
4. చర్మ సమస్యలకు నివారణ
తులసి నీటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మానికి మంచి తేజస్సును అందిస్తాయి. మొటిమలు, దురద, చర్మ ఖోరత వంటి సమస్యలు తగ్గుతాయి.