Diwali Gift : దీపావళి బంపర్ ఆఫర్.. రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితం.. ఎక్కడో తెలుసా?
Diwali Gift : దీపావళి పండుగ అంటేనే అందరికీ ఇష్టం. దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను ఎంతో ఘనంగా అందరూ జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. కంపెనీలు, వ్యాపారస్తులు తమ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా మిఠాయి డబ్బాను ఇస్తారు. అయితే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా దీపావళి పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వమే ఈ తీపికబురును అందించింది.
ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు ఉచితంగా సంవత్సరం పాటు రెండు గ్యాస్ సిలిండర్లను దీపావళి కానుకగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద గుజరాత్ రాష్ట్రంలో 38 లక్షల మంది గృహిణులు లబ్ధిదారులుగా ఉన్నారు. వీళ్లను దృష్టిలో ఉంచుకొని రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నట్టు రాష్ట్ర మంత్రి వఘాని అన్నారు. దీని వల్ల.. రాష్ట్ర మహిళలకు రూ.1000 కోట్ల లబ్ధి చేకూరనుంది. మరోవైపు సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ లపై 10 శాతం వ్యాట్ ను తగ్గిస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఒక కేజీ సీఎన్జీపై రూ.6 నుంచి రూ.7 తగ్గే అవకాశం ఉంది.
Diwali Gift : సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ లపై 10 శాతం వ్యాట్ తగ్గింపు
అలాగే.. పీఎన్జీ గ్యాస్ పైన కూడా రూ.5 నుంచి రూ.5.5 తగ్గుతుందని మంత్రి తెలిపారు. గ్యాస్ సిలిండర్ల ఆఫర్ కు సంబంధించిన రిఫండ్ మొత్తం డైరెక్ట్ గా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమకానుంది. అయితే.. దీపావళి కానుక పేరుతో ప్రభుత్వం బహుమతులను రాజకీయ లబ్ధి కోసమే ప్రకటిస్తోందని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. అయితే.. త్వరలో గుజరాత్ లో ఎన్నికలు ఉన్నందున ఓటర్లను ఆకట్టుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే.. ఉజ్వల స్కీమ్ కింద కనెక్షన్ తీసుకున్న వారికి కేంద్రం రూ.200 సబ్సిడీ అందిస్తోంది.