వరంగల్ లో KCR కు ఊహించని షాక్.. ? పార్టీ మార‌నున్న కీల‌క నేత‌..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

వరంగల్ లో KCR కు ఊహించని షాక్.. ? పార్టీ మార‌నున్న కీల‌క నేత‌..?

 Authored By brahma | The Telugu News | Updated on :1 May 2021,9:20 pm

తెలంగాణలో అధికార పార్టీ తెరాసలో ముసలం మొదలైంది. ముఖ్యంగా వరంగల్ జిల్లా లో పార్టీకి ఆయువుపట్టు లాంటి కీలక నేత సీఎం KCR కు షాక్ ఇవ్వబోతున్నాడా అనే మాటలు వినిపిస్తున్నాయి. తెరాస లో కీలక నేత అయినా కడియం శ్రీహరి విషయంలో గత కొద్దీ రోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కావాలనే శ్రీహరిని దూరం పెడుతున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.

గతంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన కడియం శ్రీహరికి గత ఎన్నికల్లో తెరాస తరుపున టిక్కెట్ దక్కలేదు. తనను కాదని తమ సామాజిక వర్గానికి చెందిన రాజయ్య కు టిక్కెట్ ఇవ్వటంతో బాగా హార్డ్ అయిన శ్రీహరి అనేక సార్లు తన అసంతృప్తిని బహిరంగంగానే చూపించాడు. అది నచ్చకనే సీఎం కేసీఆర్ శ్రీహరిని దూరం పెడుతున్నాడు అనే మాటలు వినిపించాయి. అదే సమయంలో తన తర్వాత పార్టీలోకి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ కు మంత్రి పదవి ఇవ్వటమే కాకుండా జిల్లాలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు భావించిన కడియం గత కొద్దీ రోజుల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు..

KCR

KCR

తాజాగా జరిగిన వరంగల్ పురపోరులో సైతం ఎక్కడ కడియం శ్రీహరి పేరు వినిపించలేదు. అన్ని విషయాలు దయాకర్ చేతుల మీదగానే జరిగాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఎర్రబెల్లి వర్గం కావాలంటే శ్రీహరి వర్గానికి ప్రాధాన్యత తగ్గించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏదైతేనేమి కడియం శ్రీహరి పార్టీ లో తనకు న్యాయం జరగటం లేదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనితో అటు రాజయ్య మీద ఇటు ఎర్రబెల్లి మీద విమర్శలు చేయటంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీహరి విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో వచ్చే ఎన్నికల నాటికీ కడియం శ్రీహరి పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వరంగల్ లో కడియం లాంటి నేత తెరాస కు గుడ్ బై చెపితే దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ సమస్య సర్దుమణగాలి అంటే కేసీఆర్ రంగంలోకి దిగాలని కొందరు చెపుతున్నారు. మరి సీఎం కలగచేసుకొని సర్దుబాటు చేస్తాడో లేదో చూడాలి.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది