Union Budget 2023 : ఆదాయపు పన్ను మినహాయింపు విషయంలో.. వేతన జీవులకు శుభవార్త తెలియజేసిన కేంద్రం..!!
Union Budget 2023 : ఈరోజు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. అనంతరం ఆమె ప్రసంగిస్తూ వేతన జీవులకు శుభవార్త తెలియజేశారు. ఆదాయ పన్ను మినహాయింపును ఐదు లక్షల నుండి ఏడు లక్షల వరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఏడు లక్షల వార్షికోత్సవం ఉన్నవారు ఎలాంటి పనులు చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలియజేశారు. ఇంకా ఏడు లక్షల రూపాయలు వార్షికోత్సవం దాటిన వారు 5 స్లాబులలో పన్ను విధించనున్నారు. 2023-24 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పన్ను స్లాబ్, ఆదాయపు పన్ను మినహాయింపు రూ.5 నుంచి 7 లక్షల వరకు పెంపు.. ఆదాయం రూ.7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్నులు.. వ్యక్తిగత ఆదాయపన్ను
కొత్త ట్యాక్స్ శ్లాబ్‌లు రూ.0 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు 0 శాతం పన్ను, రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ. 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను, రూ.15 లక్షలకు పై ఉంటే 30 శాతం పన్ను, 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను వర్తిస్తుంది.
#UnionBudget2023 | Personal Income Tax: “The new tax rates are 0 to Rs 3 lakhs – nil, Rs 3 to 6 lakhs – 5%, Rs 6 to 9 Lakhs – 10%, Rs 9 to 12 Lakhs – 15%, Rs 12 to 15 Lakhs – 20% and above 15 Lakhs – 30%, ” says Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/li3dXsHGfA
— ANI (@ANI) February 1, 2023