Uppal : కాంగ్రెస్ ధ‌ర్నాతో దిగొచ్చిన ఎమ్మెల్యే, కార్పొరేట‌ర్‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Uppal : కాంగ్రెస్ ధ‌ర్నాతో దిగొచ్చిన ఎమ్మెల్యే, కార్పొరేట‌ర్‌..!

Uppal : ఉప్ప‌ల్ స‌ర్కిల్‌లోని చిలుకాన‌గ‌ర్ డివిజ‌న్‌లో ఎట్ట‌కేల‌కు అభివృద్ధి ప‌నుల‌కు మోక్షం ల‌భించింది. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ధ‌ర్నాతో ఎమ్మెల్యే, కార్పొరేట‌ర్ దిగొచ్చారు. శుక్ర‌వారం అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. దీంతో కాల‌నీల‌వాసులు కాంగ్రెస్ నాయ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.అధికార పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే, చిలుకానగర్ కార్పొరేటర్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ తారస్థాయికి చేరుకున్న విష‌యం తెలిసిందే. దీంతో డివిజన్ లో అభివృద్ధి పనులు జ‌ర‌గ‌డం లేదు. కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన శిలాఫలకాలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 January 2023,1:00 pm

Uppal : ఉప్ప‌ల్ స‌ర్కిల్‌లోని చిలుకాన‌గ‌ర్ డివిజ‌న్‌లో ఎట్ట‌కేల‌కు అభివృద్ధి ప‌నుల‌కు మోక్షం ల‌భించింది. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ధ‌ర్నాతో ఎమ్మెల్యే, కార్పొరేట‌ర్ దిగొచ్చారు. శుక్ర‌వారం అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. దీంతో కాల‌నీల‌వాసులు కాంగ్రెస్ నాయ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.అధికార పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే, చిలుకానగర్ కార్పొరేటర్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ తారస్థాయికి చేరుకున్న విష‌యం తెలిసిందే. దీంతో డివిజన్ లో అభివృద్ధి పనులు జ‌ర‌గ‌డం లేదు. కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన శిలాఫలకాలు ఉత్స‌వ విగ్ర‌హాలుగా మారాయి.

నిధులు మంజూరైన వీరు పనులను ప్రారంభించకపోవడంతో అభివృద్ధికి నిరోధకంగా మారింది.దీంతో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ -బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్తి వాసులతో కలిసి గురువారం శిలాఫలకాల వద్ద ధర్నా చేపట్టడంతో అధికార పార్టీ బీఆర్ఎస్‌లో క‌ద‌లిక వ‌చ్చింది. పార్టీ అధిష్టానం రంగంలోకి దిగ‌డంతో ఎమ్మెల్యే, కార్పొరేట‌ర్ వ‌చ్చి అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు.చిలుకాన‌గ‌ర్ డివిజ‌న్‌లో ఎమ్మెల్యే, కార్పొరేటర్ తో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీ అధికారులే పనులను చేపట్టాలని

Uppal MLA and corporator who came down with Congress dharna

Uppal MLA and corporator who came down with Congress dharna

ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను కాంగ్రెస్ పార్టీ డివిజ‌న్ అధ్యక్షులు కొంపల్లి బాలరాజ్ గారు ,గండికోట గణేష్ గారు ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ .బ్లాక్ అధ్యక్షురాలు అమరేశ్వరి గారు ,ఆగం రెడ్డి గారు ,సుశీల గారు ,నాళవేలి మహేందర్ ముదిరాజ్ ,మంచాల రఘు గారు ,పస్తం శ్రీరాములు గారు ,షేక్ మదర్ వల్లీ ,గౌస్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు అమర్ ,సత్యం ,దండుగుల శంకర్ ,షకీల్ ,అష్రాఫ్ అలీ ,శ్రీనివాస్ ,రవి ,నాయకులు కోర‌డం జ‌రిగింది. స‌కాలంలో స్పందించిన అధికారుల‌కు ఈ సంద‌ర్భంగా వారు ధ‌న్య‌వాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం లో జగదీష్ గారు ,జోతీ గారు ,సురేష్ ,షబీర్ ,ప్రేమలత తదితరులు పాల్గొన్నారు

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది