Endu Chepala Pulusu : నోరూరించే ఎండు చేపల పులుసు… ఇలా చేశారంటే అసలు వదిలిపెట్టరు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Endu Chepala Pulusu : నోరూరించే ఎండు చేపల పులుసు… ఇలా చేశారంటే అసలు వదిలిపెట్టరు…

 Authored By aruna | The Telugu News | Updated on :14 August 2022,11:30 am

Endu Chepala Pulusu : చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయే మనందరికీ తెలుసు. కొందరు చేపలలో ముళ్ళు ఉంటాయని తినడానికి ఇష్టపడరు. కానీ పచ్చి చేపలు కాకుండా ఎండు చేపలతో పులుసు చేసుకుని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది .అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. ఎప్పుడు చేయని విధంగా ఎండు చేపల పులుసు ఇలా డిఫరెంట్ స్టైల్లో చేశారంటే ఎప్పుడు తినని వారు కూడా ఇప్పుడు తింటారు. ఇక ఆలస్యం ఎందుకు ఎండు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు: 1) ఎండు చేపలు 2) ఆయిల్ 3) మెంతులు 4) ఆవాలు 5) కరివేపాకు 6) అల్లం 7)టమాటా 8) ఉల్లిపాయ 9) ములక్కాడ 10) కంద 11) వంకాయ 12) పచ్చిమిర్చి 13) పసుపు 14) ఉప్పు 15) కొత్తిమీర 16) చింతపండు 17) చిక్కుడు గింజలు 18) ధనియాల పొడి 19) కారంపొడి 20) తోటకూర కాడలు త‌యారీ విధానం : ఎండు చేపల పులుసును మట్టి పాత్రలో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అర టీ స్పూన్ మెంతులు, ఒకటి స్పూన్ ఆవాలు వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి. తర్వాత రెండు రెబ్బల కరివేపాకు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి 10 ,12 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ సన్నని అల్లం తరుగు వేసి మూత పెట్టి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.

Use This Process To Make A Tasty Endu Chepala Pulusu

Use This Process To Make A Tasty Endu Chepala Pulusu

తర్వాత ఇందులో పావు కప్పు చిక్కుడు గింజలు, 15, 20 కందముక్కలు, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్ లో 7, 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఐదు ఆరు ములక్కాడ ముక్కలు, ఒక వంకాయ ముక్కలు ఎనిమిది ముల్లంగి ముక్కలు, రెండు సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి కలుపుకొని నాలుగైదు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసి వేడి ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 50 గ్రాములు చింతపండు రసాన్ని వేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు తోటకూర కాడలు వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఆరుఎండు చేపలను వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గంట తర్వాత తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింకును క్లిక్ చేయండి.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది