Uttam Kumar Reddy : ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటి అంత మాట అనేశాడు? పార్టీ మొత్తం హడలెత్తింది !
Uttam Kumar Reddy : టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేరా? అన్నట్టుగానే ఉన్నారు. అసలు ఆయన ఎందుకు పార్టీలో యాక్టివ్ గా లేరు అనేది పక్కన పెడితే ఆయనకు రాజకీయ వారసులు కూడా లేరు. ఆయన రాజకీయాలకు స్వస్తి పలికితే.. ఆయన భావాలను ముందుకు నడిపించే ఆయన వారసుడు ఎవరూ లేరు. నిజానికి ఆయన పైలట్ గా పనిచేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1994 లో రాజకీయాల్లో చేరారు. 1999 లో తొలిసారి కోదాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఉత్తమ్.
2004 లో కూడా అదే కోదాడ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2009 లో మాత్రం హుజూర్ నగర్ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత కోదాడలో 2014 లో తన భార్య పద్మావతిని బరిలోకి దించారు. ఇలా.. భార్యాభర్తలు ఇద్దరూ రాజకీయాల్లో బాగానే రాణించారు. చివరకు నల్గొండ ఎంపీగా 2019 ఎన్నికల్లో గెలిచారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొన్నేళ్ల పాటు టీపీసీసీ చీఫ్ గానూ ఉత్తమ్ పని చేశారు. కానీ.. కాంగ్రెస్ పార్టీని హుజూర్ నగర్ లో గెలిపించలేకపోవడంతో టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది.
Uttam Kumar Reddy : మరోసారి దంపతులు ఇద్దరూ పోటీ చేయబోతున్నారా?
ప్రస్తుతం పార్టీలో యాక్టివ్ గా లేనప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సుముఖంగానే ఉన్నారట. 2018 ఎన్నికల్లో తన భార్య పద్మావతి ఓడిపోయింది. అయినా సరే.. మరోసారి ఇద్దరూ పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారట. ఎలాగూ కోదాడ, హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి పేరున్న విషయం తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇద్దరూ మరోసారి ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఏంటో తెలుసు కదా. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆ రెండు నియోజకవర్గాల్లో అయినా సత్తా చాటుతుందేమో వేచి చూడాలి.