Vakapalli : 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారం.. మా భర్తలు ఇంట్లోకి రానివ్వలేదు.. పిల్లల్ని కూడా తాకనివ్వలేదు.. గంజి నీళ్లు తాగి బతికాం.. వీడియో
Vakapalli : వైజాగ్ జిల్లా జీ మాడుగుల మండలం వాకపల్లి గ్రామం గురించి తెలుసా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తోంది కదా. 16 ఏళ్ల క్రితం జరిగింది ఈ ఘటన. వాకపల్లి గ్రామానికి చెందిన 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారం జరిగింది. ఇంట్లోని మగవారంతా ఉదయం 3 గంటలకే పొలం పనులకు వెళ్లిన తర్వాత తెల్లవారుజామున పోలీసులు 6 గంటలకు వచ్చారు. 11 మంది గిరిజన మహిళలను పాడు చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ ఇంట్లోని భర్తలు..
ఆ ఆడవాళ్లను వెలివేశారు. పిల్లలను కూడా చూడనీయలేదు. తాకనీయలేదు. ఊరు పెద్దమనిషి దగ్గరికి తమ గోడు చెప్పుకున్నారు మహిళలు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాకపల్లి గ్రామానికి వచ్చిన పై అధికారులు అసలు ఏం జరిగిందో తెలుసుకునే పని చేశారు. రాజశేఖర్ రెడ్డి హయంలో ఈ ఘటన జరిగింది. మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. చాలా కోర్టుల చుట్టూ తిరిగాం. డబ్బులు ఇస్తాం అన్నారు.
Vakapalli : ఇప్పటి వరకు ఆ కేసు సాల్వ్ కాలేదు
ఇదంతా చేసింది గ్రే హౌండ్స్ పోలీసులు. ఊరిలోకి వచ్చి కనిపించిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఇప్పటికీ ఆ మహిళలు బిక్కుబిక్కుమంటూ తమ గ్రామంలో గడుపుతున్నారు. మా మీద జరిగిన అత్యాచారం గురించి ఎవ్వరికీ తెలియదు. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. వాళ్ల ముఖాలు కూడా చూడలేదు. మా చీరలు పైకి ఎత్తి మా ముఖాల మీద పెట్టి కళ్లకు గంతలు కట్టి మమ్మల్ని పాడు చేశారు. వాళ్లు అందరూ మమ్మల్ని పాడు చేసి వెళ్తుంటే అప్పుడు వాళ్లు పోలీసులు అని చూశాం. కానీ.. వాళ్లు ఎవరో తెలియదు.. అంటూ ఆ మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు.