MLA Vallabhaneni Vamsi : జగన్ వర్క్ షాప్ కి కొడాలి నాని తాను రాకపోవడంపై క్లారిటీ ఇచ్చిన వల్లభనేని వంశీ..!!
MLA Vallabhaneni Vamsi : సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు… ఇన్చార్జులకి వర్క్ షాప్ నిర్వహించటం తెలిసిందే. ఈ కార్యక్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై ప్రజా ప్రతినిధులకు పార్టీ పదవులు అధిరోహించిన వారికి జగన్ దిశ నిర్దేశం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి కొంతమంది గైర్హాజరు కావడం జరిగింది. ఈ సమీక్ష సమావేశానికి వెళ్ళని వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. దీంతో ఈ ఇద్దరు పార్టీ మారుతున్నట్లు నిన్న జోరుగా వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే ఈ వార్తలపై వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో తాను కోర్స్ చేస్తున్నట్లు ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో హాజరు కాలేదని క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ సమీక్షకు హాజరు కాకపోయేసరికి తాను కొడాలి నాని… పార్టీ మారుతున్నట్లు కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అవి కేవలం మెరుపు కలలు మాత్రమేనని, అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం పై మాట్లాడుతూ… ఎన్నికలలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఎలక్షన్స్ ఉంటాయి. పరోక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ఎప్పుడు వైసీపీ పోటీ పడలేదు.
అందుకనే తెలుగుదేశం పార్టీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని స్థానాలు విజయం సాధించడం జరిగింది. స్థానిక సంస్థల కోటలో జరిగిన ఎన్నికల్లో 19 ఓట్లు ఉన్నాయని అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారంటే దానికి ఆర్థిక అంశాలే కారణమని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల చేత డబ్బులు ఖర్చు పెట్టించడానికి ముందస్తు ఎన్నికలు అని చంద్రబాబు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసిపి నాయకులు తమతో టచ్ లో ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏదేమైనా ప్రజాక్షేత్రంలో అంతిమంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు.. అంటూ వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.