Vangaveeti Radha Meets Nara Lokesh
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పీలేరులో జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మార్చి 7వ తారీకు నారా లోకేష్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జాయిన్ అయ్యి కాసేపు కలిసి నడిచారు. ఇద్దరు పెద్ద యువనేతలు కలవడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. పాదయాత్ర అనంతరం ప్రత్యేకంగా కూర్చుని వీరిద్దరూ బేటి అయ్యి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అనేక అంశాలు చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుండి వంగవీటి రాధా పార్టీ మారనున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది.
Vangaveeti Radha Meets Nara Lokesh
జనసేన పార్టీలోకి వెళ్ళనున్నట్లు సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రసారమవుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వంగవీటి రాధా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొనడంతో ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారన్న సంకేతాలు పంపించినట్లు అయింది. ఇదిలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుండి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో వంగవీటి రాధ ఉన్నట్లు ఇప్పటికే… చంద్రబాబు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్లు ఆయన ఓకే చెప్పినట్లు టాక్ వినబడుతోంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో కీలకంగా రాణించిన వంగవీటి రాధా తర్వాత…
వైసీపీ కీలక నాయకులతో విభేదాలు రావడంతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. గత ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వలేదు అన్న కారణంతో ఆగ్రహంతో వైసీపీ నుండి వంగవీటి రాధా బయటికి వచ్చేయడం జరిగింది. అప్పటినుండి టీడీపీ లోనే కొనసాగుతూ ఉన్నారు. అయితే ఇటీవల జనసేనలోకి వెళ్తున్నట్లు వార్తలు రావడంతో ఈ విషయంలో బాలయ్య చొరవ తీసుకోవడం జరిగింది అంట. దీంతో అన్నమయ్య జిల్లాలో లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా పాల్గొనేలా పార్టీ మారలేదు అన్న సంకేతాలు ఇచ్చేలా బాలయ్య వెనక నుండి కథ నడిపించినట్లు టిడిపి పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.
Cardamom Milk : రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యమని మనందరికీ తెలుసు. పాలలో కొన్ని పదార్థాలు కలిపి…
Salt In Healthy Foods : ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు లేనిదే తినం. ఉప్పు ఆహారంలో ప్రధానమైన భాగం.…
Apply Oil Benefits Of Belly : వైద్యశాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఏడు ప్రధాన బిందువులలో ఒకటిగా పేర్కొనబడిందే…
Redmi A5 : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన షియోమీ తాజాగా భారత మార్కెట్లో బడ్జెట్ ఫోన్ Redmi A5ను…
AP 10th Class Results : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా…
Capsicum : క్యాప్సికం ప్రియులకు చేదు కబురు. క్యాప్సికం తినేవారు తప్పక ఈ విషయాలు తీసుకోవాల్సిందే... సుఖం తినడం వల్ల…
New Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హులైన వారికి…
Numerology : పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం రెండు కలిస్తేనే వారి జీవితం బాగుంటుంది అని జ్యోతిష్యులు…
This website uses cookies.