Lavanya – Niharika : మా పెళ్ళికి రావద్దు అని నిహారికకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lavanya – Niharika : మా పెళ్ళికి రావద్దు అని నిహారికకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..!!

 Authored By aruna | The Telugu News | Updated on :14 October 2023,7:00 pm

Lavanya – Niharika : మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి త్వరలోనే జరగనుంది. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా సీక్రెట్ గా తమ మధ్య ఉన్న ప్రేమను దాచి పెడుతూ వచ్చారు. ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక త్వరలోనే పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.

అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ తర్వాత రామ్ చరణ్ ఉపాసనలకు అందమైన కూతురు జన్మించడం లాంటి మంచి వేడుకలు జరిగితే నిహారికకు విడాకులు జరగడం కొంత బాధను కలిగించే ఘటన. అయితే అప్పటినుంచి నిహారిక గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎంత చూసుకున్నా మెగా ఫ్యామిలీకి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. నిహారిక విడాకులు ఇచ్చిన తర్వాత సినిమాలు చేయడానికి ఒప్పుకొని వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ప్రశాంతత కోసం పరుగులు తీస్తుంది. అయితే వరుణ్ తేజ్ పెళ్లి గురించి నిహారిక ఒక విషయంలో చాలా ఆలోచిస్తుందట. వరుణ్ పెళ్లికి వచ్చిన బంధువులంతా నిహారిక విడాకుల గురించి అనేక ప్రశ్నలు వేస్తారని ఆ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టమని వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ నిహారిక ఏడుస్తుందట.

Varun Tej Lavanya Tripathi Marriage Update

Varun Tej Lavanya Tripathi Marriage Update

ఈ విషయం తెలిసిన లావణ్య త్రిపాఠి నిహారికకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. నువ్వు ఇలా ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే నువ్వు అసలు మా పెళ్ళికి రావాల్సిన పనిలేదు అని చెప్పిందట. జనాలు, ప్రపంచం ఏమంటుందనే విషయాన్ని పట్టించుకోవడం మానేసి నీ గురించి నీ ఆనందం కోసం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటానికి ధైర్యంగా ఉండు, నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకున్నామంటే అది నీ మంచికే అని నువ్వు ధైర్యంగా మా పెళ్ళిలో కళకళలాడుతూ తిరగాలని, ఎవరు ఏం అడిగిన ధైర్యంగా సమాధానం చెప్పాలని మా అందరికీ ఆనందంగా ధైర్యంగా ఉంటుందని లావణ్య చెప్పుకొచ్చింది.

https://youtu.be/4X9czpDzqbE?si=5SbDmtJFz7p_xK7z

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది