Venki – Trivikram | వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిక్స్..స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అధికారిక ప్రకటన | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venki – Trivikram | వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిక్స్..స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అధికారిక ప్రకటన

 Authored By sandeep | The Telugu News | Updated on :15 August 2025,3:00 pm

Venki – Trivikram | విక్టరీ వెంకటేశ్‌ గత సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా తర్వాత, ఆయన తదుపరి ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ముగింపు పలుకుతూ, వెంకటేశ్‌ తన కొత్త సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

#image_title

2026లో విడుద‌ల‌..

2025 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

వెంకటేశ్, త్రివిక్రమ్ ఇద్దరూ గతంలో ఎన్నో చిత్రాలకోసం కలిసే పనికి రావాలని అభిమానులు ఆశించారు. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు త్రివిక్రమ్ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించినా… డైరెక్టర్‌గా మాత్రం ఇప్పటివరకు వెంకటేశ్‌తో పని చేయలేదు.ఇప్పుడు ఆ కాంబినేషన్ ఫైనల్ కావడంతో, అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా 2026లో విడుదల కానున్నట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది