Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌పై బ్యాన్ విధించండి.. ఆయన సినిమాలు చేయకుండా చూడండి
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం హరిహర వీరమల్లు ప్రచారానికి ప్రభుత్వ నిధులు వినియోగించారని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. అంతే కాదు హై కోర్టు గడప తొక్కారు. వీరమల్లు ప్రచారానికి ప్రభుత్వ నిధులు పవన్ వినియోగించడం… అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని, ఆయన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం అవుతుందనేది విజయ్ కుమార్ అన్నారు.
#image_title
పవన్‌పై ఆరోపణ..
జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపతో కూడిన బెంచ్ ఆ పిటిషన్‌ను తోసి పుచ్చింది. వచ్చే వారానికి విచారణను వాయిదా వేస్తూ ప్రస్తుతానికి ఒక తీర్పు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలు లేదా ఇతర ఎటువంటి వాణిజ్య ప్రకటనలలో పాల్గొనకుండా చూడాలని న్యాయమూర్తిని విజయ్ కుమార్ కోరారు. ఎటువంటి ప్రచారాలు నిర్వహించకూడదని, అలాగే సినిమాల సైతం నిర్మించకూడదని, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ వర్క్ ఏది చేయకూడదని పిటీషన్‌లో పేర్కొన్నారు.
పవన్ నటించకుండా బ్యాన్ విధించాలని అంటున్నారు. విజయ్ కుమార్ చేసిన ఆరోపణల పట్ల పవన్ కళ్యాణ్ గాని, ‘హరి హర వీరమల్లు’ చిత్ర బృందం గాని స్పందించలేదు. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమాకు ఆశించిన విజయం రాలేదు. నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను చేకూర్చింది. ఇక పవన్ నటించిన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.