Viral News : బాల్యవివాహాన్ని ధైర్యంగా ఎదురించిన 13ఏళ్ల బాలిక .. హెడ్‌మాస్టర్ సాయంతో పెళ్లి రద్దు..!
ప్రధానాంశాలు:
Viral News : బాల్యవివాహాన్ని ధైర్యంగా ఎదురించిన 13ఏళ్ల బాలిక .. హెడ్‌మాస్టర్ సాయంతో పెళ్లి రద్దు..!
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం. కేవలం 13 ఏళ్ల వయసున్న ఓ బాలిక.. తనపై జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకుని, బలవంతపు పెళ్లిని ధైర్యంగా నిరాకరించింది. నందిగామకు చెందిన ఓ వితంతువు రోజుకూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెకు ఒక కుమారుడు, 8వ తరగతిలో చదువుతున్న కుమార్తె ఉన్నారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, సమాజపు ఒత్తిళ్లతో.. కుమార్తెకు త్వరగా పెళ్లి చేయాలనుకున్న తల్లి, ఓ మధ్యవర్తిని ఆశ్రయించింది.

Viral News : బాల్యవివాహాన్ని ధైర్యంగా ఎదురించిన 13ఏళ్ల బాలిక .. హెడ్‌మాస్టర్ సాయంతో పెళ్లి రద్దు..!
Viral News ఎదురించింది..
ఆ మధ్యవర్తి, చేవెళ్ల మండలం కందవాడకు చెందిన 40ఏళ్ల వ్యక్తికి ఆస్తి ఉందని చెప్పి సంబంధాన్ని ఖరారు చేశాడు. మే 28న, బాలికకు ఆమెకు ఇష్టముకాని పెళ్లి బలవంతంగా జరిపారు. వివాహం జరిగాక కూడా బాలిక తాను చదువుకోవాలనుకుంటున్నట్టు తల్లికి చెప్పింది. కానీ తల్లి స్పందించలేదు. చివరికి, ఆ బాలిక తమ స్కూల్ హెడ్‌మాస్టర్‌ను ఆశ్రయించి తన గోడును వివరించింది. హెడ్‌మాస్టర్ తక్షణమే స్పందించి, బాలికను తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లారు.
తహసీల్దార్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, తల్లి, వరుడు, మధ్యవర్తి, అలాగే వివాహం జరిపిన పూజారి పై బాల్య వివాహ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను సురక్షితంగా రెస్క్యూ చేసి, రక్షణ హోంకు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాలిక ధైర్యానికి స్థానికులు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇలా చట్టాన్ని ఉల్లంఘిస్తూ బాల్యవివాహాలు జరుగుతుండటం ఆందోళనకరం కాగా, మరోవైపు బాలికలలో పెరుగుతున్న అవగాహన హర్షణీయం.