Viral News : ప్రీతి కేస్ కంటే దారుణం..లేడి డాక్టర్ ని చంపేసిన మరో డాక్టర్.. లాస్ట్ లో ట్విస్ట్.. వీడియో

Advertisement

Viral News : తెలంగాణ రాష్ట్రంలో మేడికో ప్రీతి కేసు ఎంత సంచాలనం సృష్టించిందో అందరికీ తెలుసు. గిరిజన తెగకు చెందిన ప్రీతిని సైఫ్ అనే సీనియర్ మెడికల్ విద్యార్థి కావాలని ర్యాగింగ్ చేయడం జరిగింది. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం.. కొన్ని రోజులపాటు హాస్పిటల్ లో మరణంతో పోరాడి చివరకి తుది శ్వాస పెట్టడం జరిగింది. సరిగ్గా ఇదే తరహాలో జమ్మూకాశ్మీర్ లో ఓ లేడీ డాక్టర్ హత్య వారం రోజుల క్రితం జరిగింది. ప్రీతి కేసులో లవ్ జిహాది ఆరోపణలు రావడం జరిగింది. కాదా ఇప్పుడు ఇదే రీతిలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన లేడీ డాక్టర్ హత్యలో కూడా లవ్ జిహాదీ కోణం ఉందని అంటున్నారు. విషయంలోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్ లో సుమేధ శర్మ… జమ్మూ కాశ్మీర్లోని డెంటల్ కాలేజ్ లో BDS చదవడం జరిగింది.

Advertisement

అక్కడే ఆమెకు జోహార్ గనై వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇతని తండ్రి మహమ్మద్ గనై. సుమేధ, జోహార్ ఇద్దరూ క్లాస్ మేట్స్. వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మరి దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు ప్రేమించుకున్నారు. వీళ్ళ ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకి తెలియదు. ఎందుకంటే అప్పటికే జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాదులు హిందువులను గట్టిగా టార్గెట్ చేయడం జరిగింది. చదువు పూర్తయిన గాని ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. కాని గత ఏడాది mds చదవటానికి సుమేధా ఢిల్లీ రావడం జరిగింది. అక్కడ ఓ ప్రఖ్యాతి కాలేజీలో MDS విద్యనుభ్యసిస్తుంది. కానీ జోహార్ మాత్రం జమ్మూలోనే ఉండిపోయాడు. నాటి నుంచి వీరి మధ్య కాస్త దూరం పెరిగింది. పెళ్లి గురించి చర్చలు జరుగుతున్న  క్రమంలో MDS కంప్లీట్ అయ్యాక చేసుకుంటానని సుమేధ జోహార్ కి చెప్పేది. అయితే ఇటీవల హోలీ పండుగ నేపథ్యంలో సెలవులు రావడంతో సుమేధ జమ్మూ కాశ్మీర్ రావటం

Advertisement
Viral News on Another doctor who kiled the lady doctor
Viral News on Another doctor who kiled the lady doctor

జరిగింది. ఫిబ్రవరి 7వ తారీకు హోలీ జరుపుకోవడానికి స్నేహితుల ఇంటికి వెళుతున్నానని చెప్పిన సుమేధ… జోహార్ ఇంటికి వెళ్లడం జరిగింది. కానీ అదే రోజు జోహార్ తన సోషల్ మీడియాలో జీవితంపై విరక్తి పుట్టింది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోస్ట్ పెట్టడం జరిగింది. అదే సమయంలో ఆన్లైన్ లో ఉన్న జోహార్ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. అంతేకాదు బంధువులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు జోహార్ ఇంటికి చేరుకునే సమయానికి లోన తాళం వేసి ఉంది. పోలీసులు ఎంత పిలిచినా పలకలేదు. దీంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లడం జరిగింది. లోనికి వెళ్లేసరికి.. సుమేధ హత్య చేయబడి ఉంది. జోహార్ ఆమెను కత్తితో పొడిచినట్లు తేలింది ఆ తర్వాత…

తనకు తాను పొడుచుకునే ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈలోపు పోలీసులు రావటంతో…. జోహార్ నీ హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందించడం జరిగింది. సుమేధ హత్య చేయబడిందని తెలుసుకుని తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఈ వ్యవహారంలో లవ్ జీహాద్ కోణం ఉన్నట్లు బజరంగ్దళ్… అనుమానం వ్యక్తం చేస్తుంది. జోహార్ పక్క ప్రణాళికతోనే సుమేధనీ హత్య చేసినట్లు భావిస్తుంది. ఈ క్రమంలో కేసు నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియాలో సూసైడ్ డ్రామా పోస్ట్ ఆడుతున్నట్లు ఆరోపణలు చేస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ లేడీ డాక్టర్ కేసు పై సిట్ ద్వారా పోలీస్ శాఖ దర్యాప్తు చేయడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Advertisement
Advertisement