Viral News : పొరపాటును స్టూడెంట్ ఖాతాలోకి రూ.6 కోట్లు.. చివరకు పెద్ద ట్విస్ట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : పొరపాటును స్టూడెంట్ ఖాతాలోకి రూ.6 కోట్లు.. చివరకు పెద్ద ట్విస్ట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 May 2024,7:30 pm

Viral News : ఈ రోజుల్లో చాలా మంది ఈజీగా సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నారు. కొంత మంది కష్టపడి పైకి వస్తుంటే.. ఇంకొందరు మాత్రం కష్టం లేకుండానే కోటీశ్వరులు అయిపోవాలని ఆశపడుతున్నారు. ఇలా జరగాలంటే వారి లైఫ్ లో ఏదో ఒక మిరాకిల్ జరగాలి. వారు లాటరీలో కోట్లు అయినా పొందాలి. లేదంటే వారి అకౌంట్ లో ఎవరైనా కోట్లు డిపాజిట్ చేయాలి. ఇలాంటివి జరగాలంటే ఎంతో రాసిపెట్టి ఉండాలి కదా. అయితే ఇప్పుడు ఓ స్టూడెంట్ విషయంలో ఇలాంటిదే జరిగింది. అనుకోకుండా ఆమె ఖాతాలో రూ.6 కోట్లు డిపాజిట్ అయ్యాయి. కానీ చివరకు పెద్ద ట్విస్ట్ ఏర్పడింది.

Viral News ఫీజులు చెల్లించేందుకు..

దక్షిణాఫ్రికాలోని వాల్టర్ సిసులు యూనివర్సిటీ(WSU)లో సిబొంగిలే మణి అనే యువతి చదువుకుంటోంది. అప్పటికి ఆమె వయసు 32 ఏళ్లు. అయితే ఆమె మధ్యతరగతికి చెందిన అమ్మాయి. ఆమె చదువు ఫీజులు చెల్లించడానికి కూడా ప్రభుత్వ పథకాలపై ఆధారపడేది. సాధారణంగా ఆహార అవసరాలకు కూడా ప్రభుత్వమే ఆమె ఖాతాలో డబ్బులు వేసేది. ఇలా ప్రతి నెలా ఆమె అవసరాల కోసం దాదాపు $100 (సుమారు రూ.8,300) వేసేది ప్రభుత్వం. కానీ ఒకసారి అనుకోకుండా ఆమె ఖాతాలో 14 మిలియన్ ర్యాండ్ ($768363.26 లేదా సుమారు రూ.6 కోట్లు) జమ అయ్యాయి.

ఇవి పొరపాటును అయ్యాయని ఆమెకు తెలుసు. కానీ తిరిగి ఇవ్వకుండా జల్సాలు చేయాలని డిసైడ్ అయింది. ఫ్యాషన్ వేర్ డ్రెస్ లు కొనుక్కుంది. లగ్జరీ కారు కొనుక్కుంది. లేటెస్ట్‌ ఐఫోన్, ఖరీదైన మద్యం బాటిళ్లను కొనుగోలు చేసింది. దాంతో పాటు ఫ్రెండ్స్ కు పార్టీలు ఇచ్చింది. కొన్ని రోజులు బాగానే నడిచింది. కానీ ఆమె సూపర్ మార్కెట్ లో వదిలేసిన బ్యాంక్ రిసిప్ట్ ద్వారా దొరికిపోయింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సిబొంగిలే మణి 2017లో అరెస్టు కాగా, 2022లో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఆమె ఆ డబ్బులను కావాలని తీసుకోలేదని ఆమె తరపు లాయర్ వాదించారు.

7th Pay Commission

7th Pay Commission

అనుకోకుండా జమ అయ్యాయి కాబట్టే ఖర్చు చేసింది తప్ప ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని తెలిపారు. ఆ డబ్బులను ‘గిఫ్ట్‌ ఫ్రమ్‌ గాడ్‌’గా భావించాననిసిబొంగిలే కోర్టుకు తెలిపింది. దాంతో ఆమెకు ఐదేళ్ల శిక్షను కోర్టు రద్దు చేసింది. కానీ సమాజానికి సేవ చేయాలని ఆర్డర్ వేసింది. కానీ ఖర్చు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని మాత్రం చెప్పలేదు కోర్టు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది