Viral News : ఇదెక్కడి పెళ్లిరా నాయనా.. పట్టుచీరలో పెళ్లి కొడుకు.. ప్యాంటు షర్టులో పెళ్లి కూతురు..!
Special tradition: మనదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కూలాలు, జాతులు.. విభిన్న సంస్కృతులు.. ఆచారాలు సాంప్రదాయాలు మనకు కనిపిస్తుంటాయి.. మరేదేశంలో కూడా ఇలాంటి కట్టుబాట్లు ఉండవు. అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విభిన్న ఆచారాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అమ్మాయి ఇంటివద్ద కల్యాణం చేస్తారు. మరి కొన్ని చోట్ల అబ్బాయి ఇంటి వద్ద కల్యాణం నిర్వహిస్తారు. అలాగే అందరూ తెలుగు వాళ్లే అయినా కట్టు.. బొట్టులో తేడాలున్నాయి.పెళ్లిలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సాంప్రదాయంలో నిర్వహిస్తారు. ఎన్నో మూఢనమ్మకాలు కూడా నమ్ముతారు. దోషం ఉందంటూ మేకలు.. గొర్రెలు కుల దైవానికి బలి ఇస్తారు. మొదటి పెళ్లి కలిసి రాదని మూఢనమ్మకంతో మొదటగా చెట్టుకు గానీ జంతువులతో గాని వివాహం జరిపిస్తారు. రీసెంట్ గా ఏపీలో ఇలాంటి ఘటనే చూసాం.
అలాగే ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం గొట్లగట్టులో అబ్బాయికి పెళ్లయితే అమ్మాయిగా ముస్తాబు చేస్తారు. చీరలో అలంకరించి గాజులు, కాటుక, లిప్ స్టిక్, బంగారు నగలు, విగ్గు పెట్టి జడ నిండా పూలు పెట్టి అచ్చం అమ్మాయిలా రెడీ చేస్తారు. ఇదేదో జంబలకిడి పంబ అనుకునేరు.. ఆ ఊల్లో వాళ్ల ఆచారమంట. ఆ గ్రామానికి చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్ర బాబును పెళ్లి కూతురిలా అలంకరించారు. వారి వంశంలో అబ్బాయిలకు పెళ్లి చేసే సమయంలో తమ ఇలవేల్పైన గురుప్పుడు స్వామికి కొలుపులు జరుపుతారట. వధువు గెటప్ లో ఆలయానికి వెళ్తూ ముత్తైదువుల నుదుట బొట్టు పెట్టి వారి ఆశీర్వాదం తీసుకుంటారట
అబ్బాయికి పెళ్లి జరిగితే పెళ్ళికి ముందు రోజు అమ్మాయిగా ప్రత్యేక దుస్తుల్లో అలంకరిస్తారు. కులదేవత ఆలయానికి లేదా గ్రామ దేవత ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లి మొక్కులు తీర్చుతారు. పెళ్లి కుమార్తెకు ప్యాంటు, షర్టు కట్టి వరుడి గెటప్ వేయిస్తారు. ఇలా చేయడం వల్ల యువ జంట సుఖసంతోషాలతో పిల్లపాపలతో ఆ గురుప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయని నమ్మకం. ఇలాంటి ఆచారాలు ఏపీలో ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో.. పశ్చిమగోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.