Viral News : ఈ విస్కీ ధర 22.48 కోట్లు .. దీని ప్రత్యేకత ఏంటంటే ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : ఈ విస్కీ ధర 22.48 కోట్లు .. దీని ప్రత్యేకత ఏంటంటే ..??

 Authored By anusha | The Telugu News | Updated on :24 November 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral News : ఈ విస్కీ ధర 22.48 కోట్లు .. దీని ప్రత్యేకత ఏంటంటే ..??

  •  1926 కాలం నాటి అరుదైన విస్కీ బాటిల్ వేలంలో 22 కోట్ల 48 లక్షలు 87 వేల

Viral News : ఒక విస్కీ బాటిల్ వేలంలో 22.48 కోట్లు ధర పలికింది. 1926 కాలం నాటి అరుదైన విస్కీ బాటిల్ వేలంలో 22 కోట్ల 48 లక్షలు 87 వేల 725 రూపాయలకు అమ్ముడుపోయి రికార్డ్స్ సృష్టించింది. ఈ వేలాన్ని ప్రముఖ సోదెబి అంతర్జాతీయ సంస్థ నవంబర్ 18న లండన్లో నిర్వహించింది. మకల్లాన్ కంపెనీ ఈ విస్కీ ని 1926లో తయారు చేసింది. మద్యం ప్రియులకు ఈ విస్కీ అంటే ఎంతో మక్కువ. వేలం పాటలో ఈ విస్కీ బాటిల్ ఊహించని దానికంటే రెండింతలు ఎక్కువ ధర పలికింది. వేలంపాట నిర్వాహకుడు జానీ పౌల్ ఈ విస్కీ లోని ఒక చుక్క రుచి చూసేందుకు ముందుగానే అనుమతి తీసుకున్నాడు.

ఎండిన పండ్లు, మసాలా, చెక్కెర రుచి ఇందులో ఉందని చెప్పారు. 1926లో మక్కల్లాన్ కంపెనీ ఈ విస్కీ ని తయారు చేసి 60 ఏళ్ల పాటు నిల్వ చేసింది. తర్వాత 1986 లో 40 బాటిల్ లోకి ఆ విస్కీని నింపింది. అయితే మక్కల్లాన్ కంపెనీ వీటన్నింటినీ అందుబాటులోకి తీసుకురాలేదు. కానీ తాను టాప్ క్లైంట్ లో కొంతమందికి అందించింది. ఎప్పుడైనా ఇలాంటి మద్యం బాటిళ్లు అందుబాటులోకి వచ్చినప్పుడు వేలంలో రికార్డు ధర పలకడం రికార్డుగా మారింది. గతంలోనూ ఇటువంటి బాటిల్ 15 కోట్ల 98 లక్షల 38 వేల రూపాయలకు అమ్ముడు పోయింది. 1926 నుంచి ఈ 40 బాటిళ్లు వివిధ రకాలుగా లేబుల్ అయ్యాయని సౌదేబి తెలిపారు.

అయితే రెండు బాటిల్ లకు ఇప్పటిదాకా ఎటువంటి లేబుల్స్ లేవు. కొత్తగా 14 బాటిళ్ళను ఐకానిక్ ఫైండ్ రేర్ లతో అలంకరించినట్లు, 12 బాటిలను పాక్ కళాకారుడు సర్ ప్లీటర్ బ్లేయిర్ తయారు చేసినట్లు తెలిపారు. తాజా వేలంలో అమ్ముడుపోయిన బాటిల్ మిగతా 12 బాటిల్లను ఇటాలియన్ పెయింటర్ వాలేరియో అడామీ డిజైన్ చేశారు. అయితే మకల్లాన్ 1926 సిరీస్ లోని బాటిళ్లు ఇంకా ఎన్ని ఉనికిలో ఉన్నాయో తెలియదు. 2011లో జపాన్ లో వచ్చిన భూకంపంలో ఒకటి ధ్వంసం అయిందని, మరొక దానిని తెరిచి వినియోగించినట్లుగా చెబుతున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది