Virat Kohli Birthday : రికార్డుల రారాజు విరాట్.. బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న గురించి తెలుసుకోవ‌ల్సిన విష‌యాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Virat Kohli Birthday : రికార్డుల రారాజు విరాట్.. బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న గురించి తెలుసుకోవ‌ల్సిన విష‌యాలు..!

Virat Kohli Birthday : టీమిండియా Team India మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ  King Kohile అని పిలుచుకుంటారు. ఆయ‌న బ‌ర్త్ డే ఈ రోజు కాగా, చాలా మంది విరాట్‌కి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ స్టార్ క్రికెటర్.. ఈ మధ్యకాలంలో అంతగా ఫామ్ లో లేకపోయినా.. క్రికెట్ లో అతడు సాధించిన రికార్డులను మాత్రం తక్కువ అంచనా వేయలేం. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన విరాట్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 November 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Virat Kohli Birthday : రికార్డుల రారాజు విరాట్.. బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న గురించి తెలుసుకోవ‌ల్సిన విష‌యాలు..!

Virat Kohli Birthday : టీమిండియా Team India మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ  King Kohile అని పిలుచుకుంటారు. ఆయ‌న బ‌ర్త్ డే ఈ రోజు కాగా, చాలా మంది విరాట్‌కి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ స్టార్ క్రికెటర్.. ఈ మధ్యకాలంలో అంతగా ఫామ్ లో లేకపోయినా.. క్రికెట్ లో అతడు సాధించిన రికార్డులను మాత్రం తక్కువ అంచనా వేయలేం. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి టెస్టుల్లో 118 మ్యాచ్ లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించి 47.83 సగటుతో 29 సెంచరీలు, 31 అర్ధసెంచరీలతో 9,040 పరుగులు చేశాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 13000 పరుగులు చేసిన ఘనత కోహ్లీకే సొంతం.

Virat Kohli Birthday కింగ్ కోహ్లీకే సొంతం..

వన్డేల్లో ఫాస్టెస్ట్ స్కోరు 13 వేల పరుగులు మాత్రమే కాదు, ఫాస్టెస్ట్ స్కోరు 8000, 9000, 10000, 11,000, 12,000 పరుగులు కూడా కోహ్లీ Virat Kohli Birthday Special  పేరిట నమోదు అయ్యాయి.43 టెస్టులు, 69 ఇన్నింగ్స్ లో 66.79 సగటుతో 16 సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో 4,208 పరుగులు చేశాడు. ఈ కాలంలోనే అతను ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో ఓ కెప్టెన్ చేసిన అత్యధిక డబుల్ సెంచరీల రికార్డు కోహ్లి పేరిటే ఉంది.అతడు 68 టెస్టుల్లో కెప్టెన్ గా ఉండగా..ఇండియా ఏకంగా 40 మ్యాచ్ లలో గెలిచింది. 17 ఓడగా.. 11 డ్రా అయ్యాయి. అతని విజయాల శాతం 58కిపైనే కావడం విశేషం. ఇప్పటి వరకూ 295 వన్డేలు ఆడిన విరాట్ కోహ్లీ 50 సెంచరీలు, 72 అర్ధసెంచరీలతో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యుత్తమ స్కోరు 183. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో, భారతీయుల్లో రెండో స్థానంలో నిలిచాడు.

Virat Kohli Birthday రికార్డుల రారాజు విరాట్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న గురించి తెలుసుకోవ‌ల్సిన విష‌యాలు

Virat Kohli Birthday : రికార్డుల రారాజు విరాట్.. బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న గురించి తెలుసుకోవ‌ల్సిన విష‌యాలు..!

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, T20I) తన పేరు మీద అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కలిగి ఉన్నాడు. 2008 నుండి మొత్తం 538 మ్యాచ్‌లు ఆడుతూ 21 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. టెస్టుల్లో మూడుసార్లు, వన్డేల్లో 11సార్లు, టీ20ల్లో 7సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో విజయవంతమైన పరుగుల ఛేజింగ్ లో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన విరాట్ ‘ఛేజింగ్ మాస్టర్’గా పేరుగాంచాడు. 102 మ్యాచుల్లో 90.40 సగటుతో 5,786 పరుగులు, 96 ఇన్నింగ్స్ లో 23 సెంచరీలు, 25 అర్ధసెంచరీలు సాధించాడు.వన్డే ప్రపంచకప్ ఒక ఎడిషన్లో అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లిదే. గతేడాది జరిగిన వరల్డ్ కప్ లో విరాట్.. 11 మ్యాచ్ లలో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలున్నాయి.ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ 538 మ్యాచ్ ల్లో 52.78 సగటుతో 27,134 పరుగులు, 80 సెంచరీలు, 141 అర్ధసెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 254 నాటౌట్. మొత్తం క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో, భారతీయుల్లో రెండో స్థానంలో నిలిచాడు. సెంచరీల్లో రెండో స్థానంలో ఉన్నాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది