Mahesh Babu Birthday : అతడు రీ-రిలీజ్ స్పెషల్ షోలో ‘పిల్లగాలి అల్లరి’కి డాన్స్ చేసి సందడి చేసిన మహిళా అభిమాని.. వీడియె వైర‌ల్‌ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu Birthday : అతడు రీ-రిలీజ్ స్పెషల్ షోలో ‘పిల్లగాలి అల్లరి’కి డాన్స్ చేసి సందడి చేసిన మహిళా అభిమాని.. వీడియె వైర‌ల్‌ !

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Mahesh Babu Birthday : అతడు రీ-రిలీజ్ స్పెషల్ షోలో 'పిల్లగాలి అల్లరి'కి డాన్స్ చేసి సందడి చేసిన మహిళా అభిమాని.. వీడియె వైర‌ల్‌ !

Mahesh Babu Birthday : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల సంబరాలకు ఎండింగ్ లేదని మరోసారి రుజువైంది. ‘అతడు’ రీ-రిలీజ్ సందర్భంగా, ప‌లు థియేటర్లలో ప్రత్యేక షోలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కి వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. అయితే ఆ మ్యాజ్‌కి అనుభ‌వించేందుకు థియేట‌ర్‌కి వ‌చ్చిన‌ అభిమానుల్లో ఒకరు మహిళా అభిమాని ఒకరు. ఆమె ఓ థియేటర్‌లో ‘పిల్లగాలి అల్లరి’ పాటకు డాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.

Mahesh Babu Birthday అతడు రీ రిలీజ్ స్పెషల్ షోలో'పిల్లగాలి అల్లరి'కి డాన్స్ చేసి సందడి చేసిన మహిళా అభిమాని.. వీడియె వైర‌ల్‌ !

Mahesh Babu Birthday : అతడు రీ-రిలీజ్ స్పెషల్ షోలో ‘పిల్లగాలి అల్లరి’కి డాన్స్ చేసి సందడి చేసిన మహిళా అభిమాని.. వీడియె వైర‌ల్‌ !

Mahesh Babu Birthday : డ్యాన్స్ అదిరింది..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె ఎనర్జీ, ఆనందం చూసి చాలామంది “ఇలాంటి ఫ్యాన్సే అస‌లు సిస‌లైన ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ బాబు 2005లో నటించిన ‘అతడు’ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మళ్లీ తెరపైకి రావడంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.

ప్రత్యేక షోలకు పెద్ద ఎత్తున మహిళా అభిమానులు కూడా హాజరవడం గమనార్హం. ఈ వీడియో కూడా వారి ఉత్సాహాన్ని చాటుతోంది. “సినిమా అంటే మేము జీవించే జ్ఞాపకాలు,” అని అంటున్నారు అభిమానులు.ఈ సంఘటన మహేష్ బాబు స్టార్‌డమ్‌ను మరోసారి రుజువు చేస్తూ, ఆయన సినిమాలకు ఉన్న స్ఫూర్తిదాయకమైన ఫ్యాన్ బేస్‌కు నిదర్శనంగా నిలిచింది. ఇక ఈ రోజు మ‌హేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ప్రీ లుక్ విడుద‌ల చేశారు. ఆక‌ట్టుకుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది