Rajamouli | బాహుబలికి 10 ఏళ్లు .. జక్కన్నకు బర్త్‌డే గిఫ్ట్‌గా స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన టీమ్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajamouli | బాహుబలికి 10 ఏళ్లు .. జక్కన్నకు బర్త్‌డే గిఫ్ట్‌గా స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన టీమ్!

 Authored By sandeep | The Telugu News | Updated on :10 October 2025,1:00 pm

Rajamouli | తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి పుట్టినరోజు (అక్టోబర్ 10) సందర్భంగా ‘బాహుబలి’ టీమ్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాహుబలి సినిమాను ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గానే కాదు, ఓ గ్లోబల్ ఫిల్మ్‌గానూ ఎలా తీశారో ఇందులో స్పష్టంగా చూపించారు.

#image_title

జక్కన్నకు గ్లోబల్ గుర్తింపు తీసుకొచ్చిన బాహుబలి

2012లో ‘ఈగ’ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి, 2015లో ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రాలతో అంతర్జాతీయంగా తన సత్తా చాటారు. ఈ రెండు భాగాలు కలిపి దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ బాహుబలి సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా భారత బాక్సాఫీస్ చరిత్రలో టాప్ 5లో నిలిచింది.

బాహుబలి సినిమా విడుదలై ఈ మధ్యే 10 ఏళ్లు పూర్తి కావడంతో, ఈ లెజెండరీ ప్రాజెక్టును మళ్లీ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. వచ్చే అక్టోబర్ 31న, రెండు భాగాల్నీ కలిపి ఒకే సినిమాగా మోంటేజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ ట్రిబ్యూట్ వీడియోలో, బాహుబలి సినిమా ఎలా తెరకెక్కించారనే మేకింగ్ విశేషాలను చూపించారు. ఇందులో బిజ్జలదేవ (నాజర్) పాత్రకు సంబంధించిన మేకింగ్ సీన్, ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. జక్కన్న తాను ఎంత పర్‌ఫెక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తారో ఈ సీన్‌ ద్వారా మరోసారి రుజువైంది.

 

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది