
Virat Kohli : లండన్‌లో కోహ్లీ స్థిర నివాసం.. ఈ నాలుగు కారణాలతో అందరిలో అనేక అనుమానాలు..!
Virat Kohli : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఆయన కెరీర్ చివరి దశలో ఉండగా భారత జట్టు టీ20 వరల్డ్ కప్ అందుకోవడంతో కోహ్లీ ఆనందం అంతా ఇంతాకాదు. విరాట్ కోహ్లీ ఇప్పుడు విశ్రాంతి లేకుండా గడుపుతున్నాడు. బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విరాట్ ముంబైలో జరిగిన వేడుకల్లో రాత్రి పాల్గొన్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే లండన్ బయలుదేరి వెళ్లారు. అయితే ఇటివల తుపాను కారణంగా బార్బడోస్‌లో టీమిండియాతో పాటు విరాట్ కోహ్లీ కూడా చిక్కుకుపోయాడు. తుఫాను తగ్గిన వెంటనే, విరాట్ సహా టీమిండియా జూలై 4న భారతదేశానికి తిరిగి వచ్చి, ప్రపంచ కప్ సంబరాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కోహ్లీ విదేశీ పర్యటనకు వెళ్లడం విశేషం.
కోహ్లీ లండన్ వెళ్లడం చర్చనీయాంశం అయింది. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తరువాత కోహ్లి, అనుష్కశర్మలు లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లుగా చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు నాలుగు ప్రధాన కారణాలు వారు చెబుతున్నారు.గత కొన్ని నెలలుగా విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ లండన్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. 2023 డిసెంబర్‌లో కోహ్లి తన కుటుంబంతో కలిసి కొన్ని రోజులు లండన్ విహారయాత్రకు వెళ్లాడు. ఆ తర్వాత లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో అనుష్కతో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోహ్లీ తన కుమార్తె వామికతో కలిసి లండన్‌లో మళ్లీ కనిపించాడు. తండ్రీ, కూతురు రెస్టారెంట్‌లో ఉన్న ఫోటో అప్పట్లో వైరల్‌గా మారింది. అనుష్క శర్మ చివరిసారిగా జూన్ ప్రారంభంలో ముంబైలో కనిపించింది.
Virat Kohli : లండన్‌లో కోహ్లీ స్థిర నివాసం.. ఈ నాలుగు కారణాలతో అందరిలో అనేక అనుమానాలు..!
కొడుకు పుట్టిన ఐదు రోజుల తరువాత విరుష్క జంట ఫిబ్రవరి 20న తమకు అకాయ్ జన్మించినట్లుగా ప్రకటించింది. ఐదు రోజుల పాటు ఈ విషయాన్ని బయటకు రాకుండా విరుష్క జంట జాగ్రత్తలు తీసుకోవడంతో అతడు విదేశాల్లో జన్మించినట్లుగా నెటిజన్స్ నిర్థారించారు. విరాట్ ఆటకు వీడ్కోలు పలికేందుకు చాలా దగ్గర ఉన్నాడు. కాబట్టి అతడు లండన్‌లో స్థిరనివాసం ఉంటే అవకాశం ఉంది. యూరప్‌లో ఉండటాన్ని చాలా ఇష్టపడతానని గతంలో ఓ సారి తెలిపాడు. ఎందుకంటే అక్కడ తనను పెద్దగా ఎవరూ గుర్తించరని, సాధారణ జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. మరి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తలలో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.