Virat Kohli : లండ‌న్‌లో కోహ్లీ స్థిర నివాసం.. ఈ నాలుగు కార‌ణాల‌తో అంద‌రిలో అనేక అనుమానాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Virat Kohli : లండ‌న్‌లో కోహ్లీ స్థిర నివాసం.. ఈ నాలుగు కార‌ణాల‌తో అంద‌రిలో అనేక అనుమానాలు..!

Virat Kohli : ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఆయన కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా భార‌త జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకోవ‌డంతో కోహ్లీ ఆనందం అంతా ఇంతాకాదు. విరాట్ కోహ్లీ ఇప్పుడు విశ్రాంతి లేకుండా గడుపుతున్నాడు. బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విరాట్ ముంబైలో జరిగిన వేడుకల్లో రాత్రి పాల్గొన్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే లండన్ బయలుదేరి వెళ్లారు. అయితే ఇటివల తుపాను కారణంగా బార్బడోస్‌లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2024,12:50 pm

Virat Kohli : ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఆయన కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా భార‌త జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకోవ‌డంతో కోహ్లీ ఆనందం అంతా ఇంతాకాదు. విరాట్ కోహ్లీ ఇప్పుడు విశ్రాంతి లేకుండా గడుపుతున్నాడు. బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విరాట్ ముంబైలో జరిగిన వేడుకల్లో రాత్రి పాల్గొన్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే లండన్ బయలుదేరి వెళ్లారు. అయితే ఇటివల తుపాను కారణంగా బార్బడోస్‌లో టీమిండియాతో పాటు విరాట్ కోహ్లీ కూడా చిక్కుకుపోయాడు. తుఫాను తగ్గిన వెంటనే, విరాట్ సహా టీమిండియా జూలై 4న భారతదేశానికి తిరిగి వచ్చి, ప్రపంచ కప్ సంబరాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కోహ్లీ విదేశీ పర్యటనకు వెళ్లడం విశేషం.

Virat Kohli : లండ‌న్‌లో ప‌ర్మినెంటా..

కోహ్లీ లండన్ వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన త‌రువాత కోహ్లి, అనుష్క‌శ‌ర్మ‌లు లండ‌న్‌లో స్థిర‌ప‌డాల‌ని భావిస్తున్న‌ట్లుగా చాలా మంది సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు నాలుగు ప్ర‌ధాన కార‌ణాలు వారు చెబుతున్నారు.గత కొన్ని నెలలుగా విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ లండ‌న్‌లోనే ఎక్కువ‌గా ఉంటున్నారు. 2023 డిసెంబ‌ర్‌లో కోహ్లి త‌న కుటుంబంతో క‌లిసి కొన్ని రోజులు లండ‌న్ విహార‌యాత్ర‌కు వెళ్లాడు. ఆ తర్వాత లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో అనుష్కతో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోహ్లీ తన కుమార్తె వామికతో కలిసి లండన్‌లో మళ్లీ కనిపించాడు. తండ్రీ, కూతురు రెస్టారెంట్‌లో ఉన్న ఫోటో అప్ప‌ట్లో వైర‌ల్‌గా మారింది. అనుష్క శర్మ చివరిసారిగా జూన్ ప్రారంభంలో ముంబైలో కనిపించింది.

Virat Kohli లండ‌న్‌లో కోహ్లీ స్థిర నివాసం ఈ నాలుగు కార‌ణాల‌తో అంద‌రిలో అనేక అనుమానాలు

Virat Kohli : లండ‌న్‌లో కోహ్లీ స్థిర నివాసం.. ఈ నాలుగు కార‌ణాల‌తో అంద‌రిలో అనేక అనుమానాలు..!

కొడుకు పుట్టిన ఐదు రోజుల త‌రువాత విరుష్క జంట ఫిబ్రవ‌రి 20న త‌మ‌కు అకాయ్ జ‌న్మించిన‌ట్లుగా ప్ర‌క‌టించింది. ఐదు రోజుల పాటు ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు రాకుండా విరుష్క జంట జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో అత‌డు విదేశాల్లో జ‌న్మించిన‌ట్లుగా నెటిజ‌న్స్ నిర్థారించారు. విరాట్ ఆట‌కు వీడ్కోలు ప‌లికేందుకు చాలా దగ్గ‌ర ఉన్నాడు. కాబ‌ట్టి అత‌డు లండ‌న్‌లో స్థిర‌నివాసం ఉంటే అవ‌కాశం ఉంది. యూర‌ప్‌లో ఉండ‌టాన్ని చాలా ఇష్ట‌ప‌డ‌తాన‌ని గ‌తంలో ఓ సారి తెలిపాడు. ఎందుకంటే అక్క‌డ త‌న‌ను పెద్ద‌గా ఎవ‌రూ గుర్తించ‌ర‌ని, సాధార‌ణ జీవితాన్ని గ‌డిపేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. మ‌రి ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌ల‌లో నిజం ఎంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది