
#image_title
B12 Boost | వేగవంతమైన జీవనశైలిలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటి విటమిన్ B12 లోపం . శరీరానికి అత్యంత కీలకమైన ఈ విటమిన్ తగ్గితే అలసట, నరాల బలహీనత, రక్తహీనత, జ్ఞాపకశక్తి సమస్యలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా శాఖాహారుల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
#image_title
ఇవి చేయండి..
ఈ లోపాన్ని సహజంగా తగ్గించడానికి ఒక సులభమైన మార్గం అందుబాటులో ఉంది. అదేంటంటే, మనకు సులభంగా దొరికే అరటిపండును ఆహారంలో చేర్చుకోవడం. అరటిపండులో విటమిన్ B12 నేరుగా లేకపోయినా, శరీరం దానిని శోషించడానికి అవసరమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అరటిపండులోని పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి విటమిన్ B12 శోషణకు సహాయపడతాయి.
అరటిపండుతో పాలను కలిపి తీసుకుంటే లోపం తగ్గడమే కాకుండా శక్తివంతంగా ఉండేందుకు సహకరిస్తుంది. అరటిపండు ముక్కలు చేసి బ్లెండర్‌లో వేసి పాలు, చక్కెర కలిపి మెత్తగా మిక్స్ చేయాలి. కావాలంటే ఐస్ వేసి చల్లగా తాగవచ్చు. పెరుగు కూడా విటమిన్ B12 అధికంగా కలిగిన ఆహారం. అరటిపండు, పెరుగు కలిస్తే పోషక విలువలు మరింత పెరుగుతాయి. : పెరుగును బాగా చిలకాలి. చిన్న ముక్కలుగా కోసిన అరటిపండును వేసి కలపాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి చల్లగా సర్వ్ చేయాలి. కొత్తిమీర ఆకులు వేసుకుంటే రుచి ఇంకా పెరుగుతుంది.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.