Vivo V60e Price | వివో అభిమానులకు గుడ్ న్యూస్! త్వరలో మార్కెట్‌లోకి వివో V60e..ధర, ఫీచర్లు లీక్
Vivo V60e Price | వివో లవర్స్‌కి ఇది ఖచ్చితంగా ఎగ్జైటింగ్ అప్‌డేట్. టెక్ బ్రాండ్ వివో ఇండియా, తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Vivo V60e లాంచ్‌కి సిద్ధమవుతోంది. గత నెలలో విడుదలైన Vivo V60 కు ఇది సిమిలర్ వేరియంట్. అయితే తాజా లీక్‌ల ప్రకారం, ఇది మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో రానుంది.
#image_title
డిజైన్ & కలర్ ఆప్షన్స్
వివో V60e ఫోన్ డిజైన్ పరంగా, ఇప్పటికే వచ్చిన V60 ఫోన్‌ను తలపిస్తుంది. బ్యాక్ సైడ్‌లో రింగ్ షేప్ ఫ్లాష్, స్లిక్ బాడీ ఫినిష్, ఆకర్షణీయమైన నోబుల్ గోల్డ్ & ఎలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ రానున్నట్లు టిప్‌స్టర్లు చెబుతున్నారు.ప్రాసెసర్: MediaTek Dimensity 7300 చిప్‌సెట్ (టాప్ మిడ్-రేంజ్‌లో మంచి పెర్ఫార్మెన్స్)కెమెరా సెటప్: డ్యూయల్ కెమెరా – వివరాలు ఇంకా రివీల్ కాలేదు
బ్యాటరీ: భారీ 6,500mAh బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ప్రొటెక్షన్: Diamond Shield Glass, సర్టిఫికేషన్: IP68 & IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. బేస్ మోడల్8GB + 128GB ₹29,999, మిడ్ మోడల్ 8GB + 256GB ₹31,999, టాప్ ఎండ్ మోడల్.. 2GB + 256GB ₹32,999గా ఉంది.వివో అధికారికంగా ఇంకా లాంచ్ డేట్ ప్రకటించనప్పటికీ, వచ్చే నెల ప్రారంభంలో భారత మార్కెట్లో అందుబాటులోకి రానుందని సమాచారం.