Walk | చెప్పులు లేకుండా నడక .. ఆరోగ్యానికి మేలు చేస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Walk | చెప్పులు లేకుండా నడక .. ఆరోగ్యానికి మేలు చేస్తుందా?

 Authored By sandeep | The Telugu News | Updated on :16 September 2025,9:00 am

Walk | చెప్పులు లేకుండా నడవడం కీలక పాత్ర పోషిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చెప్పులు లేకుండా నడిచేటప్పుడు పాదాలు నేలను బలంగా పట్టుకోవడంతో పాటు కండరాలు, స్నాయువులు మరింత బలపడతాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులకు ఇది బూట్లతో నడక కంటే ఎక్కువ స్థిరత్వం, బ్యాలెన్స్ రికవరీని అందిస్తుందని అధ్యయన ఫలితాలు తెలియజేశాయి.

#image_title

ఎలాంటి ఫ‌లితం..

వైద్య నిపుణుల ప్రకారం, చెప్పులు లేకుండా నడక కాలి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. పాదాల కండరాలను బలపరచడంలో ఇది ఉపయుక్తమవుతుంది. క్రమం తప్పకుండా ఇలా నడవడం వృద్ధులకు మరింత ప్రయోజనకరమని పలు పరిశోధనలు నిర్ధారించాయి. అయితే ఈ పద్ధతి అందరికీ అనుకూలం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మధుమేహం, పాదాల వైకల్యాలు, న్యూరోపతి లేదా తీవ్రమైన గాయాలు ఉన్నవారు చెప్పులు లేకుండా నడవకూడదని వారు సూచిస్తున్నారు. వీరికి వాకింగ్‌ బూట్లు ఉపయోగించడం ఉత్తమం. బూట్లు పాదాలపై ఒత్తిడిని సమానంగా పంపిణీ చేయడంతో పాటు గాయాలు, నొప్పి, బాక్టీరియా ఇన్ఫెక్షన్‌ ప్రమాదాలను తగ్గిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నవారు సహజ కదలికను కోరుకునే వారు చెప్పులు లేకుండా నడవవచ్చు. కానీ పాద సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకే నడక పద్ధతిని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది