Chandrababu – Jagan : కొత్త పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబుకి జగన్ మార్క్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు..!
Chandrababu – Jagan : నువ్వెంత.. నీ వయసు ఎంత.. నా రాజకీయ అనుభవం అంత వయసు కాదు నీది.. అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడే విషయం తెలుసు కదా. నిజానికి చంద్రబాబుకు 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది. వైఎస్ జగన్ కు 40 ఏళ్ల వయసు మాత్రమే ఉంది. అందుకే.. నా రాజకీయ అనుభవం అంత వయసు నీకు లేదు అంటూ పలుమార్లు జగన్ ను చంద్రబాబు దెబ్బిపోడుస్తూ ఉంటారు. చివరకు ఏం చేశారు.
ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉండగానే.. ఇప్పుడే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు చంద్రబాబు. ఆయన సంక్షేమ పథకాల వైపే చంద్రబాబు కూడా మొగ్గు చూపారు. ఇన్ని రోజులు వైఎస్ జగన్ పాలనపై, ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు ఒకేసారి యూటర్న్ తీసుకున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో భారీగా వరాల జల్లు కురిపించారు చంద్రబాబు. తాజాగా టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న పథకాలను చూస్తే అవన్నీ ప్రస్తుతం ఏపీలో అమలు అవుతున్న పథకాలే. అసలు 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత చంద్రబాబు అమలు చేశారా? వాటి గురించి ఏపీలోని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు.
Chandrababu – Jagan : నవరత్నాలకు పోటీగా భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలు
రైతుల రుణమాఫీ ఎక్కడపోయింది. డ్వాక్రా మహిళల రుణాల మాఫీ ఎక్కడ పోయింది. నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది. ఇవన్నీ అమలు చేశారా? లేదు కదా. మరి ఇప్పుడు భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాల పేరుతో ఇప్పుడు ప్రకటించిన హామీల మాటేమిటి. కానీ.. 2019 ఎన్నికల్లో జగన్ ప్రకటించిన నవరత్నాలను అధికారంలోకి రాగానే అమలు చేశారు. ఇక్కడ అర్థం అవుతోంది కదా. జగన్, చంద్రబాబు మధ్య ఎంత తేడా ఉందో. పోనీ… చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమైనా కొత్తగా ఉన్నాయా అంటే అదీ లేదు. అన్నీ ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో అమలు అవుతున్నవే. చూద్దాం మరి ఎన్నికల వరకు ఇంకెన్ని హామీలు కురిపిస్తారో చంద్రబాబు.