Periods | పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు, వంట చేయకూడదు, శరీరాన్ని శుభ్రంగా ఉంచకూడదు వంటి మూఢనమ్మకాలు మహిళలపై పరిమితులుగా మారాయి. అయితే నిపుణుల అభిప్రాయాలను బట్టి చూస్తే, ఇది పూర్తిగా అపోహే అని స్పష్టమవుతుంది.

#image_title
పీరియడ్స్ అంటే శారీరక మార్పుల కాలం..
పీరియడ్స్ అనేది మహిళల శరీరంలో సహజ ప్రక్రియ. ఈ సమయంలో హార్మోనల్ మార్పుల వల్ల కొంత అసౌకర్యం కలగవచ్చు. కానీ దీన్ని అనారోగ్యంగా భావించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, ఈ సమయంలో తల స్నానం చేయరాదన్న నమ్మకం పూర్తిగా శాస్త్రీయ ఆధారాలేనిది.పీరియడ్స్ సమయంలో శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అత్యంత అవసరం. నిత్యం స్నానం చేయడం ద్వారా శరీరానికి తాకిన బ్యాక్టీరియా, చెడు వాసన, మంట వంటి సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా తల స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి సాంత్వన లభిస్తుంది.
వైద్య నిపుణులు చెబుతున్నట్లు పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయకూడదన్న నమ్మకం తప్పుదారి పట్టించేదిగా పేర్కొంటున్నారు. “ఈ సమయంలో హైజీన్ మెయింటెన్ చేయకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. పిరియడ్ పైనుండి దిగుతూ వచ్చే రక్తం వలన కొన్ని పరిస్థితుల్లో చెడు వాసన లేదా ఇన్‌ఫెక్షన్లు కలగవచ్చు. అందుకే ఈ సమయంలో రోజూ స్నానం చేయడం తప్పనిసరి,” అని గైనకాలజిస్టులు పేర్కొంటున్నారు.