సై అంటే సై అంటున్న తెలుగు రాష్ట్రాలు.. జ‌టిల‌మైన నీటి యుద్ధం..!

Water War: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం మరింత ముదిరింది. ఒక‌రికి ఒక‌రు త‌గ్గేదే లేదు అంటున్నారు. సై అంటే సై అని తెగేసి చెబుతున్నారు. తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌పై ఫిర్యాదు చేసింది. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిపై మరోసారి కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు లేఖ రాసింది. తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధమని లేఖలో పేర్కొన్న‌ది. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. వెంటనే విద్యుత్‌ ఉత్పత్తిని ఆపించాలని KRMBని కోరింది.

దాంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య‌ లేఖల యుద్ధం ముదురుతున్న‌ది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఒక‌రి తీరును మరొకరు తప్పుపడుతూ లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి వరుస లేఖలు రాస్తూ వాటర్ వార్‌ను కొనసాగిస్తున్నాయి. కృష్ణా జలాలను చెరి సగం పంచాలంటూ తెలంగాణ రాసిన లేఖకు ఏపీ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. మరోవైపు ఇప్పటికే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్డులో పిటిషన్ దాఖలు చేసింది.

కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తున్న‌ద‌ని, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న‌ద‌ని త‌న పిటిషన్‌లో పేర్కొన్న‌ది. ఏపీకి రావాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతున్న‌ద‌ని ఆరోపించింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.

Water War: రెండు రాష్ట్రాల మ‌ధ్య నీటి గొడ‌వ ఎందుకు..?

దేశంలోని పెద్ద నదుల్లో కృష్ణా న‌ది నాలుగోది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న‌ ఈ నది పొడవులో గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి న‌దుల తర్వాత‌ స్థానంలో ఉంటుంది. దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ‌ప్ర‌దేశ్ మీదుగా ప్ర‌వ‌హిస్తుంది. సుమారు 90 కిలోమీటర్ల మేర‌ తెలంగాణలో ప్రవహించి, ఆ తర్వాత తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల సరిహద్దు వెంట ప్ర‌వ‌హిస్తుంది. అలంపురం నుంచి ముక్త్యాల వరకు ఈ నది రెండు రాష్ట్రాలకు సరిహద్దు.

kcr-telangana-dalit-bandhu

ఆ తర్వాత‌ పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంప‌కాల్లో వివాదాలు ఉండేవి. ఇప్పుడు, తెలంగాణ, ఆంధ్ర మధ్య కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది. కృష్ణానదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల‌కు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా, ఎడమ వైపున తెలంగాణ ఉంది. వీటికి ఎగువన జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా దిగువన ప్రకాశం బ్యారేజీ ఏపీ భూభాగంలో ఉంది. ఇవి కాక అనేక లిఫ్టు పథకాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలను ఈ ప్రాజెక్టులు తీరుస్తున్నాయి.

Water War: ఎవ‌రి వాద‌న వారిదే..

2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాయి. బేసిన్‌ల‌ లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68 శాతం ఉండగా నీటి వాటా 37 శాతం వచ్చింది. ఇక ఆంధ్రాలో కృష్ణా బేసిన్ 32 శాతం ఉండగా నీటి వాటా 64 శాతం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీలు అనుకున్నారు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. ఆంధ్రాకు వచ్చిన దాంట్లో తిరిగి కోస్తాకు 367 టీఎంసీలు, సీమకు 145 టీఎంసీలు అనుకున్నారు.

kadapa mla mustafa May be Minister Chance

ఇది కేవలం ఒప్పందం మాత్రమే. తీర్పు కాదు. నిజానికి కృష్ణా బేసిన్ తక్కువ ఉన్నప్పటికీ ఆంధ్రాకు ఎక్కువ నీటి కేటాయింపు రావడానికి కార‌ణం ఆ రాష్ట్రం దిగువన ఉండటం. సహజ జల సూత్రాల్లో బేసిన్ నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణకు మొదటి వినియోగదారు నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే ప్రత్యక్షంగా కోస్తా, పరోక్షంగా రాయలసీమకు మేలు. కాబట్టి బేసిన్ రూల్ కోసం తెలంగాణ, ఫస్ట్ యూజర్ రూల్ కోసం ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతున్నాయి.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

3 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

4 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

5 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

7 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

8 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

9 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

10 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

11 hours ago