Old Man : పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు. ఈ భూమ్మీద ఎప్పుడు పుడతామో.. ఎప్పుడు మరణిస్తామో ఎవ్వరికీ తెలియదు. అది కేవలం భగవంతుడికే సాధ్యం అవుతుంది. మనిషి మంచిగా బతికినా, చెడుగా బతికినా మరణకాలంలో మాత్రం అతడి మనస్తత్వం రాగద్వేషాలకు అతీతంగా మారుతుంది. ఎంత చెడ్డోడు అయినా సరే.. చివరి క్షణాల్లో నేను ఎందుకు ఇంత స్వార్థంగా బతికా. నేను ఎందుకు ఇంతమందిని నా చేష్టలతో బాధించా. తప్పు చేశా. ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటారట. తాము చేసిన తప్పులకు పచ్చాతాపంతో కుమిలిపోతారట.
తమ వల్ల బాధపడిన వారికి మనసులోనే క్షమాపణలు కూడా చెప్పుకుంటారట. ఇలా బాధపడటం ఒక ఎత్తు అయితే.. అది ఉద్యోగ రిత్యా కావచ్చు.. లేదంటే విభేదాలు వచ్చి కావచ్చు. తమ బిడ్డలకు దూరం అయిన పెద్దలు, తమ చివరి క్షణాల్లో వారిని కళ్లారా చూడాలని తపిస్తారట. వాళ్ల చేతులను తమ చేతుల్లో ఉంచుకొని కొద్ది క్షణాల పాటు ఆ స్పర్శ ఇచ్చే తృప్తిని అనుభవించాలని మనసారా కోరుకుంటారట. అలా వీలుకాకపోతే మనసులోనే కుమిలిపోతారట. తమకు ఇష్టమైన వారి పేర్లను పదే పదే పలకరిస్తారట. అంతకాలం తాము మనసులోనే దాచుకున్న గుట్టుమట్టులన్నీ తమ వారసులకు చెప్పేందుకు ప్రయత్నిస్తారట.
భర్తలైతే భార్యలను, భార్యలైతే భర్తలను వారి చేతులను తమ చేతుల్లోకి తీసుకొని తమ బిడ్డల చేతుల్లో ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలంటే కళ్లతోనే సైగ చేస్తారట. మరికొందరు అయితే.. తమ కుటుంబ సభ్యుల మధ్య గడిపిన మధుర విషయాలను నెమరు వేసుకుంటారట. కుటుంబ సభ్యులు అందరినీ చూస్తూ సంతోషంగా కన్నుమూస్తారట. మనిషి జీవితం చివరి క్షణాల్లో ఎలాగా వారి మానసిక స్థితి ఉంటుంది అనే అంశం గురించి కొందరు సైంటిస్టులు చేసిన సర్వేలో ఈ విషయాలు వారి దృష్టికి వచ్చాయి. తమ ఆత్మీయులు చివరి క్షణాలలో ఉన్నారని తెలిస్తే వెంటనే వాళ్ల కళ్ల ఎదుట నిలిస్తే అలా నిలిచిన వారిని కళ్లారా చూసి తృప్తిగా ప్రాణాలు వదిలేస్తారట.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.