Old Man : చనిపోయేముందు మనుషులు ఏం మాట్లాడుతారు.. మనసు అప్పుడు ఏం కోరుకుంటుంది.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Old Man : చనిపోయేముందు మనుషులు ఏం మాట్లాడుతారు.. మనసు అప్పుడు ఏం కోరుకుంటుంది.. వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :15 April 2023,8:00 pm

Old Man : పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు. ఈ భూమ్మీద ఎప్పుడు పుడతామో.. ఎప్పుడు మరణిస్తామో ఎవ్వరికీ తెలియదు. అది కేవలం భగవంతుడికే సాధ్యం అవుతుంది. మనిషి మంచిగా బతికినా, చెడుగా బతికినా మరణకాలంలో మాత్రం అతడి మనస్తత్వం రాగద్వేషాలకు అతీతంగా మారుతుంది. ఎంత చెడ్డోడు అయినా సరే.. చివరి క్షణాల్లో నేను ఎందుకు ఇంత స్వార్థంగా బతికా. నేను ఎందుకు ఇంతమందిని నా చేష్టలతో బాధించా. తప్పు చేశా. ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటారట. తాము చేసిన తప్పులకు పచ్చాతాపంతో కుమిలిపోతారట.

తమ వల్ల బాధపడిన వారికి మనసులోనే క్షమాపణలు కూడా చెప్పుకుంటారట. ఇలా బాధపడటం ఒక ఎత్తు అయితే.. అది ఉద్యోగ రిత్యా కావచ్చు.. లేదంటే విభేదాలు వచ్చి కావచ్చు. తమ బిడ్డలకు దూరం అయిన పెద్దలు, తమ చివరి క్షణాల్లో వారిని కళ్లారా చూడాలని తపిస్తారట. వాళ్ల చేతులను తమ చేతుల్లో ఉంచుకొని కొద్ది క్షణాల పాటు ఆ స్పర్శ ఇచ్చే తృప్తిని అనుభవించాలని మనసారా కోరుకుంటారట. అలా వీలుకాకపోతే మనసులోనే కుమిలిపోతారట. తమకు ఇష్టమైన వారి పేర్లను పదే పదే పలకరిస్తారట. అంతకాలం తాము మనసులోనే దాచుకున్న గుట్టుమట్టులన్నీ తమ వారసులకు చెప్పేందుకు ప్రయత్నిస్తారట.

what happened to this old man

what happened to this old man

Old Man : ఆత్మీయులు తమ కళ్లెదుటే ఉండాలని కోరుకుంటారట

భర్తలైతే భార్యలను, భార్యలైతే భర్తలను వారి చేతులను తమ చేతుల్లోకి తీసుకొని తమ బిడ్డల చేతుల్లో ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలంటే కళ్లతోనే సైగ చేస్తారట. మరికొందరు అయితే.. తమ కుటుంబ సభ్యుల మధ్య గడిపిన మధుర విషయాలను నెమరు వేసుకుంటారట. కుటుంబ సభ్యులు అందరినీ చూస్తూ సంతోషంగా కన్నుమూస్తారట. మనిషి జీవితం చివరి క్షణాల్లో ఎలాగా వారి మానసిక స్థితి ఉంటుంది అనే అంశం గురించి కొందరు సైంటిస్టులు చేసిన సర్వేలో ఈ విషయాలు వారి దృష్టికి వచ్చాయి. తమ ఆత్మీయులు చివరి క్షణాలలో ఉన్నారని తెలిస్తే వెంటనే వాళ్ల కళ్ల ఎదుట నిలిస్తే అలా నిలిచిన వారిని కళ్లారా చూసి తృప్తిగా ప్రాణాలు వదిలేస్తారట.

https://www.youtube.com/watch?v=9ytMG2Z3RSQ

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది