Dastagiri : దస్తగిరి డ్రామా మొత్తం బయటపెట్టిన విశ్లేషణ డోంట్ మిస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dastagiri : దస్తగిరి డ్రామా మొత్తం బయటపెట్టిన విశ్లేషణ డోంట్ మిస్ !

 Authored By kranthi | The Telugu News | Updated on :23 April 2023,3:00 pm

Dastagiri : షేక్ దస్తగిరి తెలుసు కదా. తెలియదా మీకు. దస్తరిగి ఎవరో కాదు.. వైఎస్ వివేకాను చంపిన వ్యక్తి. అవును.. షేక్ దస్తగిరి ఇప్పుడు వివేకానందను చంపి సెలబ్రిటీ అయిపోయాడు. సీబీఐ వద్ద నేను వివేకాను చంపాను అంటూ నేరుగా ఒప్పేసుకున్నాడు. అప్రూవర్ గా మారాడు. ఇప్పుడు మనోడికి బెయిల్ కూడా వచ్చింది. బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నాడు. దర్జాగా తిరగడం కాదు.. హీరో లేవల్ లో బిల్డప్ లు ఇస్తున్నాడు దస్తగిరి.

what happened to ys viveka murder case accused dastagiri

what happened to ys viveka murder case accused dastagiri

నిజానికి.. దస్తగిరి ఎవరి అండ చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నాడు అంటే.. బీటెక్ రవి అండ చూసుకొని. బీటెక్ రవి ఎవరో తెలుసు కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుట్ర పన్ని మరీ వివేకాను ఓడించాడు. వీరికి తెర వెనుక ఉన్నది ఎవరో కాదు.. వివేకా కూతురు, అల్లుడు. అసలు.. వివేకా హత్యకు ముందు దస్తగిరిది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. కానీ..ఇప్పుడు రిచ్ పర్సన్. కేవలం 40 ఇయర్స్ ఇండస్ట్రీ అండ చూసుకొని చెలరేగిపోతున్నాడు.

YS Viveka murder case: CBI asks Sheik Dastagiri to appear before court at  Hyderabad on Feb 10 | Amaravati News - Times of India

Dastagiri : దస్తగిరి వయసు 25 ఏళ్లు మాత్రమే

వివేకానంద దగ్గర డ్రైవర్ గా చేరాడు దస్తగిరి. అది కూడా సునీల్ యాదవ్ ద్వారా వివేకానంద దగ్గరికి వచ్చాడు. కానీ.. తనకున్న ఆర్థిక సమస్యల వల్ల సునీల్ యాదవ్ ఏం చెబితే అది చేసేవాడు. వివేకాను హత్య చేయాలని.. డబ్బు ఎక్కువ మొత్తంలో ఇస్తామని సునీల్ యాదవ్ చెప్పడంతో దానికి దస్తగిరి చెప్పారు. కదిరిలో గొడ్డలిని కొనుగోలు చేసిన దస్తగిరి.. ఆ తర్వాత ముగ్గురు సాయంతో వివేకానందను హత్య చేశాడు. వివేకాతో డెత్ నోట్ కూడా రాయించాడు. బీటెక్ రవి ద్వారా కూడా దస్తగిరికి మద్దతు లభించింది. అలాగే.. వివేకానంద కూతురు, అల్లుడు తెర వెనుక నుంచే మద్దతు ఇవ్వడంతో ఇక దస్తగిరిని అడ్డుకునే వారే లేకుండా పోయారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది