Chandrababu : ఏపీ లో మహిళల కి CM చంద్రబాబు బ్రహ్మాండమైన గుడ్ న్యూస్

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 2 July 2026, 6:30 pm
  •  Chandrababu : ఏపీ లో మహిళల కి CM చంద్రబాబు బ్రహ్మాండమైన గుడ్ న్యూస్

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లోని Andhra pradesh స్వయం సహాయక సంఘాల డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు బ్యాంకుల నుంచి జీవనోపాధి, స్వయం ఉపాధి కోసం తీసుకునే రుణాలపై విధిస్తున్న ప్రాసెసింగ్ ఛార్జీలు మరియు ఇన్‌స్పెక్షన్ ఛార్జీలను రద్దు చేయిస్తూ ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ఈ నిర్ణయంతో వేలాది డ్వాక్రా మహిళలు అదనపు ఆర్థిక భారం నుంచి విముక్తి పొందనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandrababu ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ SLBC సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిన అనంతరం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UBI వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ అదనపు రుసుములను మినహాయించేందుకు అంగీకరించాయి. ఈ చర్య మహిళల స్వయం ఉపాధిని మరింత ప్రోత్సహించడంతో పాటు తక్కువ ఖర్చుతో బ్యాంకు రుణాలు పొందేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Chandrababu : ఏపీ లో మహిళల కి CM చంద్రబాబు బ్రహ్మాండమైన గుడ్ న్యూస్

Chandrababu : ఏపీ లో మహిళల కి CM చంద్రబాబు బ్రహ్మాండమైన గుడ్ న్యూస్

Chandrababu డ్వాక్రా రుణాలపై ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ ఛార్జీలకు చెక్

ప్రాసెసింగ్ ఛార్జీ: రుణ దరఖాస్తు పరిశీలన, మంజూరు ప్రక్రియ కోసం వసూలు చేసే రుసుము.
ఇన్‌స్పెక్షన్ ఛార్జీ: రుణం తీసుకునే సంఘం కార్యకలాపాలను పరిశీలించేందుకు విధించే రుసుము.

ఈ రెండు ఛార్జీల కారణంగా రుణ మొత్తంపై సుమారు ఒక శాతం వరకు అదనపు భారం మహిళలపై పడేది. ముఖ్యంగా చిన్న స్థాయి వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మహిళలకు ఇది అదనపు ఆర్థిక ఒత్తిడిగా మారేది.ఈ నేపథ్యంలో మహిళలు తక్కువ వ్యయంతో రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకులకు సూచించినట్లు సమాచారం. అనంతరం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఛార్జీలను మినహాయించే నిర్ణయం తీసుకున్నాయి.ఈ నిర్ణయం వల్ల డ్వాక్రా సంఘాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కలగనుంది. ఉదాహరణకు ఒక సంఘం రూ.20 లక్షల వరకు క్యాష్ క్రెడిట్ లోన్ తీసుకుంటే, గతంలో ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ ఛార్జీల రూపంలో చెల్లించాల్సిన సుమారు రూ.33 వేల వరకు ఆదా కానుంది.

అదే రుణం మూడేళ్ల కాలపరిమితి పూర్తయ్యే సమయానికి ఒక్కో సంఘానికి దాదాపు రూ.93,500 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక డ్వాక్రా సంఘంలో సగటున 10 మంది మహిళలు సభ్యులుగా ఉంటే, ఈ నిర్ణయం వల్ల ప్రతి మహిళకు ఏడాదికి సుమారు రూ.3,300 వరకు, రుణ కాలం పూర్తయ్యే నాటికి దాదాపు రూ.9,900 వరకు ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశం ఉంది.ప్రభుత్వ అంచనాల ప్రకారం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని సుమారు 1.75 లక్షల స్వయం సహాయక సంఘాలకు ఈ నిర్ణయం ద్వారా ఒక్క ఏడాదిలోనే రూ.586 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

Chandrababu స్వయం ఉపాధికి మరింత ప్రోత్సాహం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న “ఒక్కో కుటుంబం – ఒక్కో పారిశ్రామికవేత్త” లక్ష్యానికి ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేట్ రుణదాతలపై ఆధారపడకుండా, తక్కువ వ్యయంతో నేరుగా బ్యాంకుల నుంచే రుణాలు పొందే అవకాశం పెరుగుతుంది.దీంతో చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, సూక్ష్మ వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మహిళలకు ఆర్థికంగా మరింత బలం చేకూరనుంది. బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసం పెరగడంతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబనకు కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.డ్వాక్రా మహిళల సాధికారత, స్వయం ఉపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మహిళలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే అవకాశముంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp