Jupally Krishna Rao : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయ భవిష్యత్తు ఏంటి.. టీఆర్ఎస్ ను వీడి ఏ పార్టీలో చేరబోతున్నారు?
Jupally Krishna Rao : TRS, టీఆర్ఎస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, Jupalli Krishna Rao తెలుసు కదా. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన ఈ నేత.. 2014 లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత చాలా యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆయన 2011 లోనే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తన మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ.. టీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ కోసం పోరాడారు. అందుకే.. 2014 లో ఆయనకు కొల్లాపూర్ నుంచి టికెట్ ఇచ్చారు కేసీఆర్. గెలవడంతో మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. 2018 ఎన్నికల్లో జూపల్లి.. అదే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు.
అప్పటి నుంచి జూపల్లికి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. కొల్లాపూర్ లో గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో.. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు ప్రారంభమయ్యాయి. చివరకు తనకు కనీసం ఎమ్మెల్సీ పదవి అయినా కేసీఆర్ ఇస్తారని జూపల్లి భావించినా అదీ జరగలేదు. అలాగే.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కొల్లాపూర్ నుంచి టికెట్ దక్కుతుందన్న ఆశ కూడా జూపల్లికి లేదు. ఎందుకంటే.. సిట్టింగ్స్ అందరికీ టికెట్ కన్ఫమ్ చేయడంతో ఇక.. జూపల్లికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు.
Jupally Krishna Rao : మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ లో బరిలోకి దిగుతారా?
జూపల్లికి కొల్లాపూర్ లో మంచి పట్టు ఉంది. 2004 లోనే ఇండిపెండెంట్ గా పోటీ చేసి అక్కడ గెలిచారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. మళ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి అప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీలో చేరాలని జూపల్లి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. జూపల్లి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. త్వరలోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. చూద్దాం మరి.. జూపల్లి నిర్ణయం ఎటువైపు ఉంటుందో?