#image_title
Health Tips | పాలు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలుగా ఎంతో మందికి తెలిసిందే. అయితే ఇవి ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటాయా? వాటిని తినే సమయం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం లేదా పెరుగు తినడం శరీరానికి హాని కలిగించే అవకాశముందని సూచిస్తున్నారు.
#image_title
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఉదయం లేచి నేరుగా వేడిపాలను తాగడం లేదా ఖాళీ కడుపుతో పెరుగు తినడం వలన ఉబ్బసం, అసిడిటీ, కడుపులో అల్సర, యాసిడ్ రిఫ్లక్స్ లాంటివి తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే, పాల ఉత్పత్తుల్లో ఉండే సహజ లాక్టిక్ యాసిడ్ కడుపులో ఆమ్లాన్ని పెంచి అసౌకర్యాలు కలిగిస్తుంది. పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ సాధారణంగా జీర్ణక్రియకు మంచివే. కానీ ఖాళీ కడుపుతో తీసుకుంటే అవి యాసిడ్ ద్వారా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో లాభం కన్నా నష్టం ఎక్కువే.
పాలు తాగాలంటే తిండికి తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు తాగడం ఉత్తమం. పెరుగు తినాలంటే… మధ్యాహ్నం భోజనంలో భాగంగా తీసుకోవడం మంచి ఎంపిక. పాలు, పెరుగు తప్పనిసరి పోషకాహారాల్లో భాగమే అయినా, వాటిని సరైన సమయాన తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఖాళీ కడుపుతో పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అసిడిటీ వంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Hansika | స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు హల్చల్ చేస్తున్న…
LOBO | టీవీ నటుడు, బిగ్బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…
Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…
Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి,…
Health Tips | పిస్తా పప్పులు కేవలం రుచికరమైన వంటకాలలో చేర్చే ఒక సాధారణ పదార్థమే కాదు… ఇవి మన…
Health Tips | మన భారతీయ ఆహార వ్యవస్థలో గుడ్డు అనేది ముఖ్యమైన పోషకాహారంగా మారింది. అయితే గుడ్డులోని తెల్లసొన మాత్రమే…
Lord Ganesha | హిందూ సంస్కృతిలో విఘ్నేశ్వరుడు అంటే అనుదినం ప్రతి కార్యానికి ఆరంభంలో పూజించే దేవుడు. వినాయక చవితి…
KTR - Bandi Sanjay : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో…
This website uses cookies.