Health Tips | పాలు, పెరుగు విషయంలో జాగ్రత్తలు అవసరం.. ఖాళీ కడుపుతో తీసుకుంటే ప్రమాదమేనా?
Health Tips | పాలు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలుగా ఎంతో మందికి తెలిసిందే. అయితే ఇవి ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటాయా? వాటిని తినే సమయం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం లేదా పెరుగు తినడం శరీరానికి హాని కలిగించే అవకాశముందని సూచిస్తున్నారు.

#image_title
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఉదయం లేచి నేరుగా వేడిపాలను తాగడం లేదా ఖాళీ కడుపుతో పెరుగు తినడం వలన ఉబ్బసం, అసిడిటీ, కడుపులో అల్సర, యాసిడ్ రిఫ్లక్స్ లాంటివి తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే, పాల ఉత్పత్తుల్లో ఉండే సహజ లాక్టిక్ యాసిడ్ కడుపులో ఆమ్లాన్ని పెంచి అసౌకర్యాలు కలిగిస్తుంది. పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ సాధారణంగా జీర్ణక్రియకు మంచివే. కానీ ఖాళీ కడుపుతో తీసుకుంటే అవి యాసిడ్ ద్వారా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో లాభం కన్నా నష్టం ఎక్కువే.
పాలు తాగాలంటే తిండికి తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు తాగడం ఉత్తమం. పెరుగు తినాలంటే… మధ్యాహ్నం భోజనంలో భాగంగా తీసుకోవడం మంచి ఎంపిక. పాలు, పెరుగు తప్పనిసరి పోషకాహారాల్లో భాగమే అయినా, వాటిని సరైన సమయాన తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఖాళీ కడుపుతో పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అసిడిటీ వంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.