Categories: HealthNews

Clove Side Effects | లవంగం వినియోగం ..మితంగా తీసుకుంటే ఔషధం, అధికంగా తీసుకుంటే హానికరం!

Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్‌లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి, వాసన మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు కలిగించే లవంగం… సరైన విధంగా, సరైన పరిమాణంలో తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.

#image_title

లవంగం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పంటి నొప్పికి ఉపశమనం: లవంగాల్లో ఉండే యూజెనాల్ అనే పదార్థం సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. పంటి నొప్పి సమయంలో లవంగం నమలడం లేదా లవంగ నూనెను నొప్పి ఉన్న చోట రాసినా ఉపశమనం లభిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుదల: భోజనం తర్వాత ఒకటి రెండు లవంగాలు నమలడం వల్ల అజీర్ణం, గ్యాస్‌, ఆమ్లత్వం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థను శక్తివంతం చేస్తుంది.

శ్వాస సంబంధ సమస్యలకు నివారణ:   యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలతో ఇది ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.

నోటి దుర్గంధానికి పరిష్కారం: లవంగాన్ని మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించవచ్చు. నోటిలో బ్యాక్టీరియాను తగ్గించి శ్వాసను త్రోటిగా ఉంచుతుంది.

లవంగం ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు

కడుపు సమస్యలు: ఎక్కువ లవంగాలు తీసుకుంటే ఆమ్లత, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు.

అలెర్జీలు: కొంతమందిలో లవంగం వల్ల చర్మ అలెర్జీలు, దద్దుర్లు కలగొచ్చు. ముఖ్యంగా లవంగ నూనెను నేరుగా చర్మానికి వేయడం మంచిది కాదు – ఇతర నూనెతో కలిపి మాత్రమే వాడాలి.

గర్భిణీ స్త్రీలు జాగ్రత్త: గర్భధారణ సమయంలో లవంగం వినియోగంపై వైద్యుల సలహా అవసరం. ఎక్కువగా తీసుకుంటే అది గర్భాశయాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.

రక్త ప్రవాహంపై ప్రభావం: లవంగాలు రక్తాన్ని పల్చగా చేస్తాయి. కాబట్టి శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న వారు, రక్తసంబంధ అనారోగ్యాలున్నవారు ముందు వైద్యుడిని సంప్రదించాలి.

Recent Posts

Hansika | హ‌న్సిక విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ.. ఈ పోస్ట్‌తో ఫిక్స్ అయిన ఫ్యాన్స్

Hansika | స్టార్ హీరోయిన్‌ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న…

59 minutes ago

LOBO | బిగ్ బాస్ ఫేమ్ లోబోకి ఏడాది జైలు శిక్ష‌.. ఏం త‌ప్పు చేశాడంటే..!

LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…

2 hours ago

Sleep | రాత్రి పూట హాయిగా నిద్ర పోవాలి అంటే ఇవి తింటే చాలు..

Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…

3 hours ago

Health Tips | పాలు, పెరుగు విషయంలో జాగ్రత్తలు అవసరం.. ఖాళీ కడుపుతో తీసుకుంటే ప్రమాదమేనా?

Health Tips | పాలు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలుగా ఎంతో మందికి తెలిసిందే. అయితే…

5 hours ago

Health Tips | పిస్తా ప‌ప్పుని రోజూ తినొచ్చా.. అవి తిన‌డం వల‌న ఎలాంటి ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా?

Health Tips | పిస్తా పప్పులు కేవలం రుచికరమైన వంటకాలలో చేర్చే ఒక సాధారణ పదార్థమే కాదు… ఇవి మన…

6 hours ago

Health Tips | గుడ్డు తినడంపై మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు.. ఏది మంచిది?

Health Tips | మన భారతీయ ఆహార వ్యవస్థలో గుడ్డు అనేది ముఖ్యమైన పోషకాహారంగా మారింది. అయితే గుడ్డులోని తెల్లసొన మాత్రమే…

7 hours ago

Lord Ganesha | వినాయకుడి వాహనాల వెనక ఆసక్తికర పురాణ కథలు.. ప్రతి యుగంలో ఓ ప్రత్యేక రూపం

Lord Ganesha | హిందూ సంస్కృతిలో విఘ్నేశ్వరుడు అంటే అనుదినం ప్రతి కార్యానికి ఆరంభంలో పూజించే దేవుడు. వినాయక చవితి…

8 hours ago

KTR – Bandi Sanjay : సిరిసిల్లలో ఎదురుపడ్డ బండి సంజయ్, కేటీఆర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే !!

KTR - Bandi Sanjay : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో…

17 hours ago