Pawan Kalyan : రంగంలోకి మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్… పవన్ కల్యాణ్ కి చుక్కలు చూపించబోతున్నాడు

Pawan Kalyan : నిన్న మొత్తం వైజాగ్ లో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. మూడు ప్రధాన పార్టీల నేతలంతా అక్కడే తిష్టవేశారు. దీంతో వైజాగ్ మొత్తం గందరగోళంగా మారింది. వైజాగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పలువురు వైసీపీ మంత్రుల కార్లపై దాడి జరిగింది. ఈ దాడి చేసింది ఎవరో కాదు జనసేన నేతలే అని చెప్పి పోలీసులు.. వాళ్లను అరెస్ట్ చేశారు. అయితే.. జనసేనాని వచ్చిన రోజే వైజాగ్ లో అధికార వైసీపీ పార్టీ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జనను నిర్వహించిన విషయం తెలిసిందే. టీడీపీ కూడా సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో నగరంలో చర్చా వేదికను నిర్వహించింది. అందుకే.. ఒకే రోజు వైజాగ్ లో మూడు ప్రధాన పార్టీల నేతలంతా మొహరించారు.

వైజాగ్ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ దిగారని తెలియగానే ఆయనకు స్వాగతం పలకడానికి జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమాన్ని ముగించుకొని వైసీపీ నేతలు, మంత్రులు ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏపీ మంత్రుల కార్లపై చెప్పులు, చీపుర్లు విసిరి దాడి చేశారు. ఇదంతా జనసేన పార్టీ కార్యకర్తల పనే అని పోలీసులు వెంటనే పలువురు జనసేన నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి వైజాగ్ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారు. అయితే.. ప్రెస్ నోట్ లో వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద అనుమతి లేకుండా దాదాపు 300 మంది జనసేన నేతలు గుమిగూడారని పేర్కొన్నారు. మంత్రులను చంపేందుకే వాళ్లంతా అక్కడ గుమిగూడారని పోలీస్ కమిషనర్ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.

what is there in press note released by vizag police commissioner

Pawan Kalyan : అనుమతి లేకుండా 300 మంది జనసేన నేతలు గుమిగూడారు

అది సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించడమే అని తెలిపారు. ప్రజాశాంతికి భంగం కలిగించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. మంత్రులపై దాడి చేస్తున్న సమయంలో పలువురు సామాన్య ప్రజలకు కూడా గాయాలయ్యాయని సీపీ తెలిపారు. మరోవైపు కొందరు ప్రయాణికులు తమ విమానాన్ని మిస్ అయ్యారని, ఇవన్ని ఘటనలకు బాధ్యులు జనసేన నేతలు, కార్యకర్తలని, వాళ్లపై కేసులు నమోదు చేశామని వైజాగ్ పోలీస్ కమిషనర్ ప్రెస్ నోట్ లో తెలిపారు. ఇప్పటి వరకు పలువురు జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే.. పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ లోనూ ఉదయం నుంచే పోలీసులు కూడా అక్కడే కాపలా కాశారు. అక్కడ కూడా పలువురు జనసేన నేతలను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Recent Posts

Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..!

Wife  : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…

6 hours ago

AP Farmers : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన‌ మంత్రి అచ్చెన్నాయుడు..!

AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…

7 hours ago

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…

8 hours ago

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో !

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

9 hours ago

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

10 hours ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

11 hours ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

12 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

13 hours ago